పుట:Prabhutvamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్వహణస్వరూపము

73

లకు రాష్ట్రములో నధికారమిత్తునని వాగ్దానముచేసి వశవర్తులను చేసికొనుటకు వీలుండదా అని ఇంక కొందరు ప్రశ్నించుచున్నారు. ఇంతియగాదు. ఏకొలదిమందికో అధ్యక్షనియామకశక్తిని ప్రసాదించినచో ఆ యధ్యక్షుడు ఆకొలదిమంది చెప్పునట్టి మాటలకు చెవియొగ్గవలసిన వాడగును. ముఖ్యమగు విషయములలో స్వతంత్రుడుగ ప్రవర్తింపలేడు. మన జిల్లాబోర్డు మునిసిపాలిటీల అధ్యక్షుల స్థితిగతులే ఇందుకు తార్కాణములు. కార్యనిర్వహణము కావింపవలసిన యధ్యక్షుడు మహాజనముచే ప్రత్యక్షముగా నెన్ను కానబడునేని ములహాయిజాపెట్టి తన నిర్వాచకులను తనవశవర్తులుగా చేసికొనుటకుగాని నిర్వాచకులు కార్యాచరణమున నతని స్వాతంత్ర్యమును నిరోధించుటకుగాని వీలుండదు.

నిర్వచితుడైనను తనయధికారము శాశ్వతమనుకొనునేని నిరంకుశుడు కాకపోడు. అందుచేతనే ఉత్తమాధికారిని నిర్వచించుకొను రాష్ట్రములన్నియును అట్టియధికారి యధికారమునకు కాలపరిమితి ఏర్పరచియున్నారు. అమెరికాసంయుక్తరాష్ట్రముల యధ్యక్షునకు అధికారము నాల్గుసంవత్సరముల కాలము. తరువాత అతడు మరల నిర్వచితుడుకావచ్చును. అగునను నమ్మకముమాత్రము లేదు. పరాసుభూమిలో, అధ్యక్షున కధికారము ఏడేండ్లు. అతడును మరల నియమితుడైనకావచ్చును. చిలీదేశపు టధ్యక్షునకు కాలపరిమితి యైదేండ్లే. అతడు మరల నిర్వచితుడు కానేకాడు. ఈ తీరుగా నిర్వచితులైన ఉత్తమాధికారులుండు రాష్ట్రములంతటను వారియధి