పుట:Prabhutvamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

ప్రభుత్వము

ములను గురించి మనదేశములో నిప్పు డాలోచింపవలసిన పనిలేదు. మనము బ్రిటిషు సామ్రాజ్యమున కంకితులము. బ్రిటిషు అధికారులు ఏమిచేసిన నది మన మంగీకరింపవలెను. వారికి లోబడి కొద్దిగా గవర్నరుజనరలున కధికారముకలదు, ఆయధికారమెంత, యేమి, యెట్లుపయోగ పడుచున్నది యని విచారించు స్వాతంత్ర్యము మన శాసనసభలకు నేటిశాసనము మూలకముగా కలుగలేదు.

అధికారశాఖకుగల ఇంకొక్క స్వాతంత్ర్యమును గురించి వ్రాయవలసియున్నది. నేడేర్పడియుండు శాసనములు, న్యాయస్థానములు, సాక్ష్యములు, విచారణలు వీనిమూలకముగా నొకొకప్పుడు నిరపరాధులు సాపరాధులుగా దండింపబడుచున్నారనుట సిద్ధాంతముగా నంగీకరింపబడినది. నిజ మాలోచింప ఒకొకప్పుడుగాక సామాన్య ముగా నిరపరాధులే దండింపబడుచున్నారాయను ననుమానము దోచకపోదు. కాబట్టి అన్ని రాజ్యములలోను ఉత్తమాధికారికి 'క్షమా'థికార మొసంగబడి యున్నది. అధికారులు గొప్పనేరములు చేసినప్పుడు ఉత్తమాధికారి యాస్వాతంత్ర్యము నుపయోగింప వచ్చునను నవకాశమున్నచో ననర్థములు వాటిల్లుననుట స్వయంప్రకాశము. అతని యుత్తరువులేకనో అతని యెరుకతోనే యెరుకలేకయో వారుచేయు దౌర్జన్యములను, దౌష్ట్యములను క్షమించుట కతనికి అవకాశము కలుగును. అట్లు కలుగకుండుటకై ఈ 'క్షమా'ధికారము గొప్పయధికారులు చేయు నేరములపట్ల వినియోగ పడరాదని కొన్ని కొన్ని రాష్ట్రములలో నియమ మేర్పడియున్నది.