శాసననిర్వహణస్వరూపము
65
దు. నలుగురు ఉప్పు కారము వేయుట కధికారముకల వారైన యెడల వంటయైనను చెడిపోవునను నప్పుడు యుద్ధ సమయములలో పదుగుర యభిప్రాయము పనికిరాదనుట వేరుగ జెప్పబనిలేదు. ఐరోపామహాసంగ్రామము ప్రారంభమైనప్పుడు ఆంగ్లభూమిలో, విషయములు పదుగురాలోచించి రమారమి బహిరంగపరచి పనిచేయుటవలన కొన్నిదొసగులు పొసగినవని యెల్ల రెఱుంగుదురు. అట్టిస్థితి కలుగునని యెదురుచూచియే యెల్లరాజ్యములలోను భూసైన్య నావికాసైన్యాధికారములను సంపూర్ణముగా నుత్తమాధికారియధికారముననే యుంచియున్నారు. వీనికి తగిన యధికారులను నియమించుట యుద్ధావసరములలో నేయేపని యెట్లెట్లు నడుపవలయునో యెల్లయు నిశ్చయించుట యేకముఖముగా అతనిమూలకముగా జరుగుచున్నవి.
యద్ధ ముపక్రమించు నధికారమును నుత్తమాధికారికి ఆంగ్లభూమిలో సంక్రమించియున్నది. ఉత్తమాధికారియనిన నిజమునకు మంత్రివర్గమేయైనందున నిదియు ప్రజలయధీన మనుకొనవలసినదే. ఫ్రాంసుభూమిలో నధ్యక్షుడు యుద్ధమునకు బోనెంచినప్పుడు శాసనసభల రెంటి యుత్తరువును పొందవలెను, అమెరికాసంయుక్తరాష్ట్రముల యధ్యక్షుడు ప్రజాప్రతినిధిసభ యనుమతిని పొందిన చాలును. ప్రజాసత్తాకములలో నంతటను కొద్దికొద్ది భేదములతో ఈయధికారము కొంతవరకు ఉత్తమాధికారికే సంక్రమించుచున్నది.
యుద్ధము ఉపక్రమించుట, సంధి ఇత్యాదివిషయ