Jump to content

పుట:Prabhutvamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

ప్రభుత్వము

మాత్రము అధికారశాఖచేసిన నిర్ణయములను అమలులో పెట్టు సదుపాయములు శాసనసభలవారు చేయ వలసి యుందురేకాని ఇతరవిధముల నానిర్ణయములను చెనకుటకు రాదు. ఇందుకు కారణము లేకపోలేదు. ఆంగ్లభూమిలో ఇట్టి నిర్ణయములను చేయునట్టివారు మంత్రివర్గము. రాజు యంగీకారము రమారమిగా నామకార్థము. మంత్రివర్గము శాసనసభలచే నియమితము. ఏనాడు శాసనసభలకు మంత్రివర్గముపై విశ్వాసము లేక పోవునో ఆనాడు ఆమంత్రివర్గము రాజీనామాయిచ్చి తీరవలసియున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రములలో పద్ధతి భిన్నముగా నున్నది. అచ్చటి యధ్యతుడు ప్రజానిర్వచితుడే. కాని ఒక్క పరి నిర్వచితుడైనపిదప అతనికి నియమితమైయుండు అధికారకాలమంతయు నతడు నిరంకుశుడు. కాబట్టి అచ్చటి శిష్టసభవారు ఇతరరాజ్యములతోటి అతడు కల్పించుకొను సంబంధములలో జోక్యము కలుగచేసికొనుటకు అవకాశము పెట్టుకొనినారు. వా రంగీకరింపనిచో నతడు చేయు నొడంబడికలు చెల్లవు. అతడు చేసికొనిన యొడంబడికలను వారు ఒప్పుకొనిన నొప్పుకొనవచ్చును. మార్చిన మారువవచ్చును. త్రోసివేసినను త్రోసివేయవచ్చును. ప్రజాప్రతినిధిసభకును కొంత యిట్టి యధికారము కలదు. కావున నే అమెరికా సంయుక్త రాష్ట్రాధ్యక్షుడు విల్సను ఐరోపియను రాష్ట్రములతో చేసికొనిపోయిన యొడంబడికలు అమెరికా శాసనసభలలో తీక్ష్ణవిమర్శకు పాల్పడవలసి వచ్చినవి.

యుద్ధములింకను లోకమునుండి తుడువబడిపోలే