పుట:Prabhutvamu.pdf/64

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

ప్రభుత్వము

జనరలు ఇచ్చకువచ్చిన మేరకు ప్రజలయొక్క స్వాతంత్ర్యములనే నిరోధించు శాసనమునైనను ఆరుమాసములు అమలులో నుండునట్లు చేయవచ్చును. ఆరేసిమాసముల చొప్పున ఆకాలవ్యవధిని పెంచుకొనవచ్చుచుండ నగుననియునుగూడ ఇటీవలిచరిత్రచేత స్థిరపడినది.

అధికారశాఖయొక్క ప్రాబల్యము ఇంతటితో తీరిపోయిన దనుకొనరాదు. ఉత్తమాధికారి శాసనసభలను నుపక్రమించుటయందును, చేర్చుట యందును, వాయిదాలు వేయుటయందును, ఆపివేయుటయందును, రద్దుచేయుటయందును కొన్ని కొన్ని యధికారములు కలవాడై యున్నాఁడు. జర్మనీ, అమెరికా సంయుక్తరాష్ట్రముల వంటి రాష్ట్రములలో ఉత్తమాధికారితో సంబంధము లేకయే శాసనసభ సామాన్యముగా ఈనాడు, ఈ సమయమున, ఈరీతిని చేరవలసినదను కట్టుబాటుకలదు. ప్రత్యేకముగా విశేషసమావేశము జరుపవలసి యుండిననే అధ్యక్షుడు కలుగజేసికొనవలసి యుండును. ఇంగ్లండులో ఈ పద్ధతి లేదు. శాసనసభలు చేరవలసి యున్నప్పుడు రాజు (మంత్రుల సలహామీద) సభ్యులందరు చేరవలసినదని యుత్తరువీయవలసి యున్నాడు. అతడు నియమించిననాడు సభ చేరవలసియున్నది. ప్రత్యేకము అందుకని జాగ్రత్తగా సిద్ధముచేసిన ఉపక్రమోపన్యాసమును రాజు సభకు పంపుచున్నాడు. దానిని రాజుపేరట చదువుచున్నారు. సభ యుపక్రమమగుచున్నది. ఇంత యట్టహాసము పైకి కాన్పించినను సర్వమైన పనులును రాజుపేరుపెట్టి చేయువారు ప్రజానిర్వచితులగు మంత్రులేయైనందున ఆంగ్లరా