శాసననిర్వహణస్వరూపము
55
నధ్యక్షుడు సర్వాధికారధూర్వహుడు. అతడు ఎవ్వరి సలహానైనను తీసికొనవచ్చును. ఎందరితో నైనను సంప్రతించుకొనవచ్చును. అధికారులతోను, అనధికారులతోను ఆలోచించు కొనవచ్చును. కాని ఎవ్వరి మాట ననుసరించియు నతడు నడచుకొనవలయునను నిర్బంధములేదు. తన యిచ్చకువచ్చిన రీతిని ప్రవర్తింప వచ్చును. ఎల్లయధికారమును ఆతని దే. ఎల్లజవాబుదారియు నాతనిదే. ఇంగ్లాండు, ఫ్రాంసు ఈదేశములలో సర్వరాజనీతియు ఉత్తమాధికారి నిర్ణయించుటలేదు. ఇంగ్లండులో ఉత్తమాధికారి రాజు. కాని అధికారనిర్వహణము అతని చేతులలో లేదు. మంత్రివర్గ మెట్లు చెప్పిన న ట్లత డంగీకరించి కావలెను. నిజముగా ముఖ్యమంత్రియే సర్వాధికారి, అయిన శాసనబద్ధముగ ముఖ్యమంత్రి యధికారముగాని, మంత్రివర్గముయొక్క యధికారముగాని యెచ్చటను సూచితము కాలేదు. బహుకాలాగతమగు నాచారమే వీరికి శరణ్యము. ఫ్రాంసులో ఉత్తమాధికారి అధ్యక్షుడు. కాని అతడును మంత్రుల యాలోచన లేక యెక్కువ స్వతంత్రించుటకు రాదు.
సివిలు సర్విసు
ఇట్లగుటచేత అధికారనిర్వహణ వర్గమును గురించి యాలోచించు చోట ఉత్తమాధికారి సర్వాధికార ధూర్వహుడా, ఇతరాధికారుల యధికారముచే పరిమితుడా యని యాలోచించుట యవసరము కావచ్చును. కాని సర్వాధికారధూర్వహుడై నను కాకున్నను నొక్కమాట మాత్రము నిజము. రాజ్యకార్యములను గడుపుట కేర్ప