పుట:Prabhutvamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

ప్రభుత్వము

నుత్తమాంగముగా పరిగణింపబడు చున్నది. ప్రజాప్రతినిధి సభకును, శిష్టసభకును వివాదము కలిగినప్పుడు ప్రజలు యెవ్వరివైపున నుండునో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు ప్రజాప్రతినిధిసభ నేరుగా ప్రజలచే నెన్నుకొనబడునది ప్రజకు నిష్టములేనిచో బహుస్వల్ప కాలములో మారి పోవునది. కాబట్టి ఈసభ సర్వసామాన్యముగా ప్రజలలోని యుద్రేకమును ననుసరించియే ప్రవిర్తించుచుండును తమ్ము ననుసరించు రాజ్యాంగసభపక్షమును ప్రజల వహింపక శిష్టసభపక్షమును వహింతురా ? ఈకారణముచేత ఆంగ్లభూమిలో ప్రజాప్రతినిధిసభ పై యుద్ధి యయి పోయినది. అమెరికాసంయు క్త రాష్ట్రములలోను, నేటి యితర ప్రజాసత్తాక రాష్ట్రము లనేకములలోను శిష్టసభ, ఆసంయోగము నందలి ప్రత్యేకరాష్ట్రముల ప్రతినిధులసభ యయి యుండుటచేత ప్రజాప్రతినిధిసభకును, నీ సభకును సంఘర్షణ కలుగు నవకాశములు మిక్కిలి తక్కువ. కాబట్టి రెండుసభలకు కొంచె మించుమించుగా సరి సమానమైన హక్కు లేర్పడి యున్నవి.

సభలో విధానములు

ప్రజాప్రతినిధిసభ కానిండు, శిష్టసభ కానిండు ఏసభ యైనను ఆలోచనచేసి కార్యముచేయుట కేర్పడిన సభలుగాని ఉబుసుపోకకు కాలముపుచ్చుటకు నేర్పడిన సభలు కావు. అందులో ఇరువురుమువ్వురు చేరునట్టి సభలును గావు. అనేక సంఖ్యాకులు చేరునట్టి సభలు. ఇందరు చేరినప్పుడు కార్యక్రమము నడచుటకేదో, యొకవిధానము కావలసియుండును. అందరును ఏకకాలమున మాటలా