పుట:Prabhutvamu.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

ప్రభుత్వము

లను నేకప్రవాహమున దీర్చుటకు రెంటికిని కొంతసంయోగముండదగును.

రెండుసభల యుపయోగము

ఏదోయొకవిధమగు నుపయోగము కలదని తోచుచున్నను, రెండు సభలవలని సుస్పష్టప్రయోజన మేమియాయను సందేహము మాత్రము లోకమును బాధించుచునే యున్నది. శిష్టసభలోని వారలలో నెక్కువమంది యొక కక్షివారై , ప్రజాప్రతినిధిసభలోనివా రింకొక కక్షివారైనప్పుడు రెండు సభలకును ఘర్షణ తప్పదు. శాసనావసరము కలిగినప్పుడు పనికిమాలిన పోరాటములు సంభవించి ఆలస్యములు జరుగుటయుకలదు. పోటీకిగాను ప్రజాప్రతినిధిసభ శిష్టసభకు ఇష్టముగాని శాసనమును నుపక్రమించుటయు కాననగును. శిష్టసభ మొండిపట్టుబట్టి అభివృద్ధి కాటంక మగుటయు సంభవించినది. అమెరికాసంయుక్తరాష్ట్రము లందువలె శిష్టసభకు ప్రత్యేకమగుపని కలుగనిచోట శిష్టసభ ప్రజాగౌరమును పోనాడుకొనినదనుటయు నిక్కువమే, ప్రత్యేకప్రాంతముల సంయోగము సరిసమానమగు స్థితియందు సమకూరవలసి యున్నప్పుడు శిష్టసభ యుపయోగకర మగునుగాని సామాన్యరాజ్య కార్యనిర్వహణమున కది యెంతో సహకారియని చెప్పుటకురాదు.

సభల ఆధికారములు

శిష్టసభకును, ప్రజాప్రతినిధిసభకును గల అధికారములు ఎల్ల దేశములలోను రమారమి సమానముగానే తోచుచున్నవి. రెండుసభలలోని సభ్యులును తమతమ