శాసననిర్మాణస్వరూపము
37
ముప్పదియేండ్లు వచ్చినగాని శిష్టసభ్యత్వమున కర్హత యుండదు. మొత్తముమీద ప్రజాప్రతినిధి సభ్యత్వార్హతకు కావలసిన వయోగుణమునకంటె శిష్టసభ్యత్వమున కెక్కువ వయోగుణము కావలయుననుట సామాన్యాంగీకారమును చెందియున్నది.
వయోగుణ మెక్కువగా పాటించుటయేకాక మరికొన్ని యుపాయములచేతను శిష్టసభకు స్థిరత్వము నెక్కువగా కల్పించుటకు నేర్పాటులు జరిగియున్నవి. ప్రజాప్రతినిధి సభకు అధికారకాలపరిమితి తక్కువ, శిష్టసభకు ఎక్కువ. అమెరికాసంయుక్తరాష్ట్రములలో ప్రజాప్రతినిధిసభ రెండు సంవత్సరముల కొకపర్యాయము నిర్వచితమగుచున్నది. శిష్టసభ ఆరు సంవత్సరముల కొక పర్యాయము. అంతేకాదు. శిష్టసభలోని సభ్యు లెల్లరును నొకేపర్యాయము వదలిపోవుటలేదు. ఉన్నసభ్యులలో మూడవవంతు మూడేండ్ల కొకపర్యాయము మారుచుందురు. ఈవిధమగు నుపాయముల వలన రాజ్యకార్య నిర్వహణమునందు ఏదోకొంత స్థైర్యము కలుగుటకు అవకాశ మేర్పరుపబడినది. శిష్టసభయు, ప్రజాప్రతినిధిసభయు ఏకరీతిని ఒక్క టేనాడు రద్దగుచుండు నెడల, క్రొత్తగా వచ్చినవారు కార్యజాలమును క్రొత్తగా నుపక్రమించు చుండునెడల రాజ్యకార్యములు జరుగుట దుర్ల భమగునను నాలోచనయే యీ తారతమ్యములకు కారణమైనది. రాజ్య జీవితమును క్రమాభివృద్ధినందునట్టి జీవకళకలది. ప్రాతకు ప్రాత క్రొత్తకు క్రొత్త త్రెంపిన ట్లేర్పడుచుండునేని సరళమును, సహజమునునగు ప్రవృద్ధిజరుగదు. ప్రాతక్రొత్త