శాసననిర్మాణస్వరూపము
31
మించబోయే పెద్దలు 104 గురుందురు. స్వదేశసంస్థానాధీశ్వరుల కీయధికార మిచ్చుటేగాక ఇండియాశాసనసభలలోని ప్రధమసభలోను 125 గురను మూడింట ఒక్కభాగమును నియమించే అధికారమును ఇచ్చినారు. మన ప్రాంతీయశాసనసభలలోని అప్పరు హౌసులలో గవర్నరు నియమించే సభ్యులు ఆరోవంతు కెక్కడను ఎక్కువ యుండరు. లోయరు హౌసులు పూర్ణముగా ప్రజ లెన్నుకొనేవి. కాంగ్రెసువారి పలుకుబడి బలములచేత మంత్రులు జరిపే దినచర్య పరిపాలన కడ్డుదగులునట్లు తన ప్రత్యేకాధికారములు గవర్నరు వినియోగించడములేదను సదాచారము ఏర్పడుచుండగా ఇండియాసభలను పైనచెప్పిన రీతిగా శిష్టులయు, స్వదేశసంస్థానాధీశులయు వశముచేయ వీలులేదు. కాబట్టే కాంగ్రెసువారు ఫెడరేషనును — ఇండియాప్రభుత్వమునకు క్రొత్త ఆక్టులో ఏర్పడిన విధానమును - ప్రచారములోనికి రానీయమని పట్టుబట్టినారు.
నేటిదినము ప్రపంచములో ప్రజాసత్తాకములే యెక్కువ. డిక్టేటరులుగా నేర్పడియుండు హిట్లరు, ముస్సోలినీలుగూడ తాముచేయు దుండగపు పనులకుగూడ - మొన్నటి ఆస్ట్రియా ఆక్రమణకువలె -ప్రజలవోట్లు - రెఫరెన్డము - కోరుచున్నారు. వారి విధానములనుగురించి ముందు వినగలరు. కాని ప్రజాపరిపాలితములలో ననేక రాష్ట్రములయందు శిష్టసభలు కలవని యెరుంగుట మాత్రము ప్రస్తుతకర్తవ్యము. వీనియం దన్నిటను శిష్టసభలకు సభ్యులను నియమించు నధికారము ప్రజల యధీనమున నేయున్నది, పరాసుభూమి, స్వీట్‌ర్లాందు, బెల్జి