30
ప్రభుత్వము
లలో నీరీతి నిర్మాణ మొకకొంత యుండినది. కాని ఈరాష్ట్రములును నిపుడు ప్రజాసత్తాకములయి పోయినవి. కాబట్టి పరంపరాగతశిష్టసభకల రాజ్యము అయిరోపాలో ఇంగ్లం డొక్కటియే కానవచ్చు చున్నది. బ్రిటిషురాజ్యములో చేరిన యధినివేశములలో కొన్నిటను, ఇదివరకు బ్రిటిషురాజ్య సంబంధములు కలిగిన రాష్ట్రములలోను ఈవాసన వదలలేదు. 'కనడా'లోని శిష్టసభకు గవర్నరు జనరలు యావజ్జీవసభ్యులను నియమించును. దక్షిణాఫ్రికాలో శిష్టసభ సభ్యులు 32 రు ఎన్నుకొనబడు చున్నారుగాని ఎనమండుగురు మాత్రము నియమితులు గలరు. అందులో నలుగురు నల్లవారి సంరక్షణకొరకట. స్వదేశజులయి బహుసంఖ్యాకులయిన నల్లవారికిగాని, మనదేశమునుండి ఏనాడో అచ్చట చేరికొని దేశము నభివృద్ధిపరచిన హైందవులకుగాని అచ్చట స్వరాజ్యమును లేదు. వోటును లేదు. స్వల్పసంఖ్యాకులైన తెల్లవారిదే సర్వము. స్వతంత్రములుగాని యధినివేశములమాట చెప్ప నక్కరయేలేదు. నిన్నటివరకును బ్రిటిషుసంరక్షణలో నుండి యింకను పూర్ణముగా స్వతంత్రముగాని ఈజిప్టులో సుల్తాను శిష్టసభలోని అయిదింట రెండువంతులను తాను నియమించును. ఇట్లే మెసపొటేమియాలోను ప్రభువైన ఫెయిజల్ శిష్టసభలోని ఇరువదిమందిసభ్యు లెల్లరను నియమించును. 1935-వ సంవత్సరపు గవర్నమెంటు ఆఫ్ ఇండియా ఆక్టుననుసరించి ఇండియా అంతటికిని ఏర్పరచబోయే శిష్టసభలో మనప్రాంతికశాసనసభల ప్రతినిధులు 156 గురతో స్వదేశసంస్థానాధీశులు నియ