పుట:Prabhutvamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

ప్రభుత్వము

లోనివారు పరంపరగా ప్రభుసభలోనికి ప్రవేశము గలవారగుచున్నారు. కావున నేటిక్రొత్త రేపటిరోత యగుచున్నది. 750 సంఖ్యగలది ఈ ప్రభుసభ. అందులో స్కాట్లండుప్రభువులు పదునార్గురు, ఐర్లాందులు ప్రభువులు పదునాలర్గురు, నేటిదినము ఇండియా ప్రభువు ఒక్కరు, తక్కుంగల వారు ఆంగ్లభూమి ప్రభువులునై యున్నారు.

ప్రభుసభలో ఇందరుప్రభువులు పరంపరాగతముగా కూర్చొనుట కర్హులగుట యేలొకో యర్థముకాదు. పరంపరాగతసామర్థ్యము వీరికి కలుగుచున్నదాయనిన నది సున్న . పండితపుత్రు డన్నమాట పరమసత్యము, అయిన పండితపుత్రుడగువాడు పండితుడుకాడని యర్థముకాదు. కొంద రుద్దండులైన పుత్రులుందురు. కాని కొందర కన్వయించునది సామాన్యసూత్రముగా నంగీకరింపరాదు గదా! ఈ ప్రభుసభవా రొక్కొక పర్యాయము కనుబరచిన మౌఢ్యమునకు మితియేలేదు. లోక మీమార్గమున నడచుచున్నదికదా, మనమడ్డుపడిన నీప్రవాహములో మనము కొట్టుకొని పోవలసినదే కాని ప్రవాహమును నిరోధింప జాలము అను నాలోచనయే ఒక్కొక్కప్పుడు వారికి కలుగలేదు. తమస్వలాభమును, తెగయొక్క లాభమును సమకూరిన జాలునని వారలు మొండితనము కనుబరచుట వారికి సహజమైయుండినది. కాబట్టియే నేటిదినము ఆంగ్లభూమిలోని ప్రభుసభకు విశేషస్వతంత్రాధికారము లేదు. క్రమక్రమముగా ఆంగ్లప్రజ ప్రభుసభవారి రెక్కలువిరిచి వై చినారు. ఆసభవారు నేటిదినము ప్రజూ