శాసననిర్మాణస్వరూపము
27
సభయొక్క ప్రతిబింబముగా 'శిష్టసభ'యు సృష్టితమగు నేని అచ్చటి 'బహుసంఖ్య'యే యిచ్చటి 'బహుసంఖ్య' యగును. అచ్చటిబలమే యిచ్చటి బలమగును. అచ్చటి బలహీనులే యిచ్చటను బలహీనులుగానుందురు. కావున రెండు సభలుండుటవలన నింకను ఎక్కువ యుద్రేకమునకు, ఎక్కువ యన్యాయమునకు, ఎక్కువ యక్రమమునకు కారణము కావచ్చును. అందుచేతనే రెండు సభల యొక్క స్వరూపనిర్ణయమునందును ఏదో కొంత విభేదము కల్పించు కొనుటకు ఎల్ల దేశములును ప్రయత్నించినవి. ఒక్కొక్క దేశమును ఒక్కొక్క విధమగు భేదమును పాటించినది. అయిన అన్ని దేశములలోను రమారమి ప్రజాప్రతినిధిసభ ఏకరూపమును దాల్చునట్టి ప్రయత్నములే కొనసాగినవి. శిష్టసభవిషయమునందు మాత్రము అనంతస్వరూపములు కాన నగును.
ఆంగ్లభూమిలోనిశిష్టసభ పూర్ణముగా ప్రాతవాసన కలది. న్యాయవిచారకులలో నలుగురను మాత్రము సార్వభౌముడు ప్రభుసభకు 'జీవిత ' సభ్యులుగా నియమించుచున్నాడు. మతాధికారమునకు జేరిన మరికొందరు సభ్యులును ఆసభ నలంకరించుచున్నారు. మంత్రులు తమపని సాగించుకొనుటకు సృష్టించిన “ప్రభువు 'లును గలరు. కర్మకర “ప్రభువు ”లును నేడు వెలసినారు. తక్కుంగల వారందరును పరంపరాగతముగా వచ్చిన ప్రభుపద బలము చేత నీసభయందు సుఖాసీనులగు చున్నారు. అప్పటికప్పుడు మన 'సింహా' వంటివారలు ప్రభువులుగా నియోగింప బడుట కలదు. కాన నియోజితులయిన వారివంశము