26
ప్రభుత్వము
(3) ఇంతేకాదు, మరియొక విధముగాను నీశిష్ట సభలు ఉపయోగపడుచున్నవి. కొన్ని కొన్ని దేశములలో, ముఖ్యముగా అమెరికా సంయుక్త భూమిలో, అనేకరాష్ట్రములు ఏకప్రభుత్వముగా నేర్పడియున్నవి. ఈరాష్ట్రము లొక్కొక్కటియు విస్తీర్ణమునను, జనసంఖ్యయందును ఎంతెంతో భేదపడియున్నవి. ఒక్క రాష్ట్రము లక్షలమైళ్ళ వైశాల్యముకలదై కోట్లకొలది ప్రజలతో నిండియున్నది. మరియొకరాష్ట్రము నూర్లు వేలకు మించనిమైళ్ళవిస్తారముకలదియై పరిమిత జనసంఖ్య కలదై యున్నది. ప్రజాప్రతినిధి సభలలోవలె సంయుక్తరాష్ట్రములకు సంబంధించిన శిష్టసభలోకూడ ప్రజా సంఖ్యానుగుణముగ నధికారమిచ్చుచో చిన్నచిన్న రాష్ట్రములను పెద్దరాష్ట్రములు కబళించి తినిపోవును. ఇట్టి మహారిష్టమును నివారించి ప్రతి రాష్ట్రమునకును ఇతరములతో సమానాధికార మిచ్చుటకు శిష్టసభ సహకారి యయి యున్నది. వివిధప్రాంతములును, నానారీతులగు స్వదేశ సంస్థానములును గల మన దేశము నందును సంపూర్ణ మైన ప్రజాస్వామ్యము నెలకొనినపిదప 'శిష్ట సభ'ల ఈవిధమగు నుపయోగమే కావచ్చును.
అంగభేదము కావలెను
ఎప్పుడు రెండుసభలు కావలయునను సిద్ధాంత మేర్పడినదో, ఎప్పుడు రెండుసభలకును ఉద్దేశ్యములలో తారతమ్య మున్నదనుట యొప్పుకొనినామో, అప్పుడే ఈ రెండుసభలును ఒకే పద్ధతి ననుసరించి నిర్మితమైన పక్షమున లాభము లేదనుట స్పష్టనుయినది. ప్రజాప్రతినిధి