పుట:Prabhutvamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్మాణస్వరూపము

21

శాఖ రాజ్యాంగములలో ముఖ్యతమమయి తలమానికముగా గణింపబడుచున్నది.

ప్రతినిధి పద్ధతి

శాసననిర్మాణమున ప్రజయెల్లయు జోక్యము కలుగజేసి కొనుటకు అవకాశ మున్న యెడల ఆ రాష్ట్రమునందు ఉత్తమశాసనాధికార మున్న ట్లెంచవలయుననుట నాగరకరాష్ట్రములలో అంగీకృతమైన సిద్ధాంతము. ఈసిద్ధాంతము కార్యరూపమున కానిపించుటలేదు. కన్పించుట సాధ్యమునుకాదు. పూర్వకాలమున మనదేశమున నీపద్ధతియుండిన దందురు. కొంత తరువాత ఆథెన్సునగరమున నీపద్ధతి పొడగట్టినది. కాని, అచ్చటను స్త్రీలకుగాని, బానిసలకుగాని 'వోటుకు' అర్హత యుండలేదు. పిదప కొన్నికొన్ని యూరోపుపట్టణములలో ప్రజలందరకు శాసనాధికారముండు ఛాయలుదోచినవి. నేటిదినము స్విట్జరులాండులోని కొన్ని పట్టణములలో పరిమితముగ శాసననిర్మాణ మొక కొన్నిసందర్భములలో అందరు ప్రజల స్వాధీనమైనది. ఇతర రాష్ట్రములలోను 'రెఫరెండము' అనుపేరిట నిది యంగీకృతమగుచున్నది. రాష్ట్రములు పెద్దవియై ప్రజాసమూహము మెండై యుండుటచేత ఏ దేశములోను ప్రజలందరునుచేరి శాసననిర్మాణముచేయుట సాధ్యముకాలేదు. ఇందుకు ముఖ్యకారణములు రెండు. (1) అసంఖ్యాకజనము చేరినయెడల తలకొకమాటయై ఏచిన్న విషయమైనను తీర్మానమగుటకు నేండ్లుపూండ్లు పట్టిపోవును. (2) అసంఖ్యాకజనముపై బరువు వేసినప్పుడు ఒక్కరును జవాబుదారి తమకు కలదని