పుట:Prabhutvamu.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడు శక్తులు

19

మనరైతులు ఫారెస్టు, డీ. పీ. డబల్ యు ఇత్యాదివిషయములలో దుర్భరావస్థ పడవలసివచ్చినది. ఈపరిస్థితియంతయు నొక్క కాలమున పాశ్చాత్యభూములలో పొడసూపినదియే. మనదేశమునందు కాంగ్రెసువారి నిరంతరప్రయత్నముచేతను, భారతపుత్రీపుత్రుల యపారత్యాగముచేతను మనకు నేటిదినము పరగణాలలో నొకవిధమయిన స్వపరిపాలన యేర్పడి పరగణాలమట్టుకు సర్కారు ఇలాకాలపయి మనవోట్లచే నేర్పడు మంత్రులకు అధికారము కలిగియున్నది. కాని భారతప్రభుత్వము పూర్ణముగా స్వతంత్రమగువరకు నిరంకుశఛాయ విడిచిపోయిన దనుకొనరాదు. నేటి ఐ. సి, ఎసుల నియామకము, వారితీసివేత, వారి రక్షణ శిక్షణలు సర్వము మంత్రుల యధీనమైననాడే మనకు నిజమగు స్వాతంత్ర్యము కలిగినట్లెన్నదగును. ఇదివరలో సంపూర్ణప్రజాప్రభుత్వము లనుకొనిన జర్మనీ, ఇటలీ మున్నగు రాష్ట్రములలో శాసననిర్మాణ, నిర్వహణాధికారములు హిట్లరు, ముస్సోలినీల హస్తగతములగుటచేత శాసనవివరణాధికారులనుగూడ లొంగదీసికొని వారు నేడు 'నియంత'లను క్రొత్తరకపు నిరంకుశాధికారులు కాగలిగినారు. అందుచేతనే నేటికిని ఎంతటిప్రజాప్రభుత్వములు ప్రబలినను పాశ్చాత్యభూములలో ఉదారులైనవారందరును శాసననిర్మాణ, వివరణ, నిర్వహణములను వేరువేరుగనే వ్యవహరింప జూచుచున్నారు. శాసనవివరణ, శాసననిర్వహణాధి కారములను కలెక్టరులు మున్నగు నధికారులలో నేకముగా నుంచరాదనియు, విభజింపవలసిన దనియు మనదేశమున కాంగ్రెసుమంత్రివర్గపరి