Jump to content

పుట:Prabhutvamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ప్రభుత్వము

యందు వ్యాపించియుండిన పద్ధతి. సూక్ష్మవిమర్శ మరియొకచోట చేయనగును. పాశ్చాత్య భూములలోనో శాసననిర్మాణ, శాసనవివరణ, శాసననిర్వహణాధికారము లన్నియు కొంతకాలము రాజుల చేతులలోనుండి, తరువాత సామంతుల చేతులలోబడి, ప్రజల యొత్తిడిచేత క్రమక్రమముగా వేరుపడి మరల ప్రజాప్రభుత్వములు విరివిగా తలయెత్తిన తరువాత ప్రజాప్రతినిధులలో కేంద్రీకారము నందుచున్నవి. డిక్టేటరులలో ఈ కేంద్రీకరణము విపరీతమై అలజడి కలిగించుచున్నది. శాసననిర్మాణ, వివరణ, నిర్వహణాధికార విభాగమునకు కలిగిన ముఖ్యకారణము అధికారుల నిరంకుశప్రవర్తన. దానిని మట్టుపెట్టి రాజ్యమున ప్రజల యభీష్టము నెరవేరునట్లు చేసికొనుటకు ప్రజాసమూహము రాజులకును, అధికారవర్గములకును శాసననిర్వహణాధికారము మాత్ర ముంచి, తక్కుంగల యధికారములను క్రమక్రమముగా తమకో, అది సాధ్యముకానిచో అధికారవర్గమునకు ప్రత్యక్షముగా లోబడని యట్టి ప్రత్యేకవ్యక్తులకో, చెందజేయ ప్రయత్నించుచు వచ్చినది. మన దేశములోను దేశీయమహాసభ ఏబదియేండ్లుగ శాసనసభ సంపూర్ణముగా ప్రజానువర్తి కావలసినదనియు, అధికారవర్గమువారికి న్యాయవిమర్శన శక్తియుంగూడ నుండరాదనియు - అనగా కలెక్టరులు పోలిన వారికి మేజిస్ట్రీటు అధికార ముండరాదనియు--కోరుటకు కారణమును ఇదియే. బ్రిటిషురాజ్య మిచ్చట స్థాపితమైన పిదప శాసననిర్మాణ, వివరణ, నిర్వహణశక్తులు మూడును అధికారవర్గమునందు కేంద్రీకృతమయి యుండుటచేత