పుట:Prabhutvamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడువిధములు

13

మునకు కలదగుటంజేసి సంఘమునకు సంబంధించిన కట్టుదిట్టములకును స్థిరత్వము కొంతవరకు అవసరమగుచున్నది. ఆలోచించి ఈ కట్టుదిట్టములను అమర్చి పెట్టునట్టి వారు శాసనకర్తలు. మనదేశమునందు పూర్వ మిట్టిపనిని ఋషులు చేసిరందురు. నేటిదిన మెల్లచోటులలోను శాసనసభలలో చేరి శాసనసభ్యు లీ కార్యమును నెరవేర్చుచున్నారు.

అయిన ఈ స్థిరత్వము అచలముగాదు. మానవుడు బుద్ధివికాసము కలవాడు. తనప్రతిభ చేత నిమేషనిమేషమును ఉత్తర ఉ త్తమస్థితులకు బ్రాకుచుండు స్వభావము కలవాడు. కాబట్టి ఏనాడోచేయబడిన శాసనమునైనను ప్రస్తుతోపయోగమునకు సరిపరచుకొనవలసినవాడు. అందుచేత శాసనగర్భమున నిమిడియుండు పదజాల మొకటియే యైనను కాలానుగుణముగా అర్థ మొక కొంతవిభేద పడుట కవకాశముకలదు. లిఖితమగు పదముల కొక్కటే యర్థ మెల్లప్పుడును నుండదు. ఏసందర్భమున మాటల నుపయోగింపవలసి యుండునో ఆసందర్భము ననుసరించి మాటలయర్థము మారవచ్చుననుట యెల్ల రెరింగినవిషయమే. 'ఏమయ్యా' అనునీరెండు పదములయర్థ మాలోచింతము. ముఖవికారమేమియు లేక వీనిని నుపయోగించునెడల సంగతియేమి అని యడిగి నట్లగును. ఈపదములనే కుటిలంపుచిరునగవుతో నుపయోగింతుమేని 'నీవు చేసిన యపచారము నేనెరుగుదును. ఏమిసమాధానమిచ్చెదవు? తెలుపు'మని బెదరించినట్లగును. ఈపదములనే కీల్గొంతుతో మొగము తేలవైచి పలికినయెడల , 'అయ్యో, నే