పుట:Prabhutvamu.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

ప్రభుత్వము

శాస్త్రము, పరాశరస్మృతి యిత్యాదులు ఆధారములుగా నున్నవి. వీనికి వ్యతిరేకముగా నడచుట యనిన మహాపాపమని తలంచునట్టివారును ఇంకను కోటానుకోటులున్నారు, మితాక్షరి, దాయభాగ న్యాయములు ఏనాడో ఏర్పడినవి నేటికిని ఉపకరించుచున్నవి. ఈరీతిగా శాసనములకు చిరాయువు కలిగియుండుట ఒక్క మనదేశములోనే కాదు. మనకు ప్రభువులుగానుండు ఆంగ్లేయుల దేశచర్రితమును ఆలోచించినను, వారలు ఏ పదిమూడవశతాబ్దపు శాసనమునో మాటిమాటికి తమసర్వస్వాతంత్ర్యములకును ఆధారముచేసికొని మాట్లాడుట గమనింపనగును. ఇట్లనుటచేత శాసనములు మారుచుండలేదని చెప్పుటగాదు. సంవత్సరము సంవత్సరము మారునట్టి శాసనములును నేటిదినము గలవు. [1]కాని మొత్తముమీద శాసనములు బహుకాలము స్థిరత్వముగలవై యుండుననుట నిక్కువము. అట్లు స్థిరత్వముగలవై యుండునవియే శాసననామమున కర్హ ములనియు జెప్పవచ్చును. ఎందువలన నన సంఘము దినదినాభివృద్ధి నందునట్టి వ్యక్తియైనను పూర్వసంబంధములను దినదినమును త్రెంచుకొనునట్టిదిగాదు. ఈనాటిజీవితమునకు నిన్నటిజీవితమును బునాదిచేసికొని, ఈనాటి జీవితమును నిన్నటి జీవితముతో సమన్వయము చేసికొని, రేపటి జీవితమునకు ఈనాటిజీవితమును ఆధారము కావించుకొనుచున్నది. ఇట్టి యనంతస్వరూపము సంఘ

  1. ప్రపంచరాష్ట్రముల నగ్రస్థానము నాక్రమించినదని పేరు గనిన అమెరికాసంయుక్తరాష్ట్రము సంవత్సరమునకు 2500 శాసనములు చేయుచున్నదట.