పుట:Prabhutvamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

ప్రభుత్వము

(1) దేశమునందలి వ్యవసాయవాణిజ్యములను, పరిశ్రమలను పెంపొందించి దేశాదాయ మార్గములను అభివృద్ధిచేయుట

(2) దేశమునకు వలయు వైద్యసహాయాదికముల నమర్చుట

(3) రైళ్లు, రోడ్డులు, వంతెనలు, విమానములు మున్నగునవి కట్టించి రాకపోకలకు ననుకూలములు కల్పించుట

(4) బ్యాంకులు, విదేశములతోటి ఆర్థికసంబంధములు ఇత్యాదులు కల్పించి ప్రజలకు ఆర్థికానుకూల ములను పొసగించుట

(5) తపాలా, తంత్రీసమాచారములు ఇత్యాదు లేర్పరచి ప్రజలకు సహాయపడుట

మొదలగు ప్రజాసౌకర్యనిర్మాణమునకు సంబంధించిన ధర్మములు క్రమక్రమముగా నేర్పడినవి. ఏర్పడు చున్నవి.

నిజమునకు ఈ కాలమున ఒకవైపున ప్రతిగొప్ప రాష్ట్రమును మహాఘోరయుద్ధమునకు సిద్ధపడుచున్నట్లు, అన్ని బలములను పెంచుకొనుచున్నను అన్ని రాష్ట్రముల వారును తాము లోకశాంతికిగానే యిట్టిపని చేయుచున్నామని ప్రకటించుకొనుచున్నారు. ప్రపంచసంగ్రామానంతరము 'లీగ్ అఫ్ నేషన్సు' అను సర్వరాజ్యసమితి యేర్పడి ఆయుధవిసర్జనసమావేశములు జరిపి లోకశాంతిని సమకూర్చవలెనని ప్రయత్నించినది. ప్రపంచములోని సర్వప్రజలకును సంబంధించిన ఆరోగ్య, వైజ్ఞానిక, ఆర్థిక విష