పుట:Prabhutvamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

ప్రభుత్వము

లకు ఇంగ్లండులోని జ్యూరరులకు నున్న యధికారము గాని ఆవకాశములుగాని లేవు. ఇచ్చట “జ్యూరరు" లున్నచోటికి న్యాయవిచారణకర్త లేగుటలేదు. న్యాయస్థానములున్నచోట “జ్యూరరు” లేర్పడుచున్నారు. సివిలు వ్యాజ్యములలో జ్యూరరుల కధికారములేదు. క్రిమినలులో మాత్రము, అదియు ఎక్కువయైన నేరములకే, ఈసంస్థ లుపయోగపడుచున్నవి. ఒక్క 'జ్యూరరు' విభేదపడి నప్పు డిచ్చట ప్రతివాది సురక్షితు డగుటలేదు.

పంచాయతులకును “జ్యూరీ” లకును ఇంత ప్రాముఖ్యము కలుగుటకు మరియొక్క కారణమును కలదు. ఒక్కని యాలోచనకంటె పదుగురయాలోచన న్యాయపక్షముగా నుండును. ఈయర్థమును బురస్కరించుకొనియే కొన్నికొన్ని సందర్భములలో న్యాయాధికారులు ఒంటిగా కూర్చొని సంగతులను విచారింపక న్యాయస్థానములో కలవారిరువు రిరువురుగానో, మువ్వురు మువ్వురుగానో, అవసరమగు నెడల అందరును ఏకముగానో కూర్చొని వ్యా యోగములను వినుచున్నారు. మన యుత్తమన్యాయ స్థానముల పద్ధతుల నెరింగిన వారలకు ఈసంగతులన్నియు కరతలామలకములే.


__________

ఆంధ్రభూమి ముద్రణాలయము - వేపేరి, మద్రాసు.