పుట:Prabhutvamu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనవివరణస్వరూపము

113

వరకు పంచాయతులే మనకు పరమాధారములుగానుండినవి. ఎల్లవిషయములకు పంచాయతులే. న్యాయవిచారణకు పంచాయతులు. మతవివాదవిచారణకు పంచాయతులు. కోర్టులకు కొల్లబెట్టు కొరమా లినతనము పెరిగిన తరువాత పంచాయతులపేరు అదృశ్యమైనది. ఒక్కమతాచార విషయములకుమాత్రము - ఉత్తమజాతులు బీడువడగా తక్కువజాతులవారు ఈపంచాయతులను ప్రచారమున నుండనిచ్చినారు. ఇప్పటికి బహుకాలముగా మనదేశస్థులు కోర్టులమూలకముగానందిన మహారిష్టములు దిలకించి ప్రభుత్వమువారు మరల పంచాయతులను ప్రచారములోనికి దెచ్చుట కేర్పరచుచున్నారు. సంతోషము.

ఆంగ్లభూమిలో బహుళతమముగా వ్యాప్తియందుండునట్టియు, మనదేశమునందును కొంచెముగా నవలంబింప బడినట్టియు 'జ్యూరి' (అసెసరుతో సహా) పద్ధతి యీపంచాయతిపద్ధతికి సహోదరము. ఇంగ్లండులో నేటికిని న్యాయవిచారకర్తలు ఆయా ప్రాంతములలో సమావేశమయి ఆయాప్రాంతముల ప్రజలలోనుండి 'పండ్రెండుమంది. “జ్యూరరు” లను సివిలు క్రిమినలు వ్యాజ్యెములన్నిటను నేర్పరచి తీర్మానములను జేయుచున్నారు. పండ్రెండుమందిలో ఒక్కడువిభేదపడినను ప్రతివాది నిరపరాధియే. బ్రిటిషుపౌరుడు తనసోదరులు పండ్రెండుగురు తన్ను విచారింపనర్హులుగాని, తదితరు లర్హులుగారని ఘంటాపథముగ జెప్పుకొనుచున్నాడు.

ఈయాచారము ననుసరించి మనదేశములో 'జ్యూరరు' లను 'అసెసరు'లను ఏర్పరచుచున్నారు. కాని వీర