పుట:Prabhutvamu.pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనవివరణస్వరూపము

109

భిన్న జాతులు

అయిన నీపద్ధతికి భేదము లేనే లేదనుకొనరాదు. కోర్టులలోను అనేకవిధములయిన భిన్నజాతు లేర్పడి యున్నవి. ఈ భిన్నజాతులలో ముఖ్యతమమయినది అధికారులుచేయు దోషములను విచారించు న్యాయస్థానము. ఇట్టి జాతికోర్టులు ఆంగ్లభూమిలో లేవు. కాబట్టి మనభూమికిని ప్రాకలేదు. దోషస్థుడు ముఖ్యమంత్రికానిండు, సామాన్యుడగు కనిస్టేబిలుకానిండు ఎంతటి యధికారియైనను ఆంగ్ల సీమలో సామాన్యప్రజలకు ఏన్యాయస్థానము లేర్పడియున్నవో ఆన్యాయస్థానములలో విచారణ నందితీరవలెను. తనకు ప్రత్యేకము న్యాయాధికారి కావలయునని కోరుటకురాదు. ఈకారణముచేత నే 'బ్రిటిషు న్యాయవిచారణ'యనిన నుత్తమోత్తమమని లోకమున పేరుపడియున్నది. అందువలననే మన దేశములో న్యాయవిచారణయందక్రమములు జరిగినప్పుడు మననాయకులు 'బ్రిటిషున్యాయము' పేరు చెరుపవలదని అధికారులకు హెచ్చరిక చేయుచుందురు. "నేను తెల్లవాడను, నా జేసినతప్పులు విచారింప తెల్లవాడేతగినవాడు. కాబట్టి నన్ను సామాన్య న్యాయస్థానమునకు గొనిపోవలదు” అని ఒక్కజాతివారు కోరు నేర్పాటు సరికాదని ఖండించుచుందురు. అదియట్లుండ నిండు. ఐరోపాఖండములోని నాగరకదేశములలో అనేక దేశములందు ఆంగ్లభూమిలోవలె గాక అధికారుల తప్పులనువిమర్శించు కోర్టులు వేరుగా నేర్పడియున్నవి. ప్రభుత్వాధికారులను సామాన్యజనులవలె నెంచి సామాన్యజనులవలె విమర్శకు భాజనులను చేసినయెడల ప్రభుత్వము