పుట:Prabhutvamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభుత్వమనగా నేమి?

7

అట్టి నిరంకుశుల అధీనమున నున్నప్పుడు ఏవిధముగానైనను తాము వానిని స్వాధీనపరచుకొనుచు వచ్చిరి. అయిన నేటిదినము పాశ్చాత్యభూములలోను, ప్రాచ్యభూములలోను ప్రజాసత్తాకములు ప్రబలి ప్రజాస్వాతంత్ర్యము స్థాపితమైయున్నది. కాబట్టి ప్రజలు పూర్వము మనగ్రామములలో సమష్టిమీద నెన్ని కార్యములు జరుపుచుండిరో అన్ని కార్యములు దేశమంతటికిని సమష్టిమీద ప్రభుత్వమువారు జరుపవలయునని కోరుచున్నారు. అంతేకాదు. దేశమునందలి 'గనులు' ఇత్యాదులు ప్రత్యేకముగా ఒక్కరి స్వాధీనమున నుండరాదనియును ప్రభుత్వములవారే స్వాధీనముచేసికొని పరిపాలించి అందువలని లాభమును ప్రజలందరకును అందజేయవలయుననియు అభిప్రాయపడుచున్నారు.[1]

కాబట్టి నేడు 'ప్రభుత్వము' అను అధికారమువారు చేయవలసిన కర్మలు

(1) బయటి శత్రువులనుండి దేశమును సంరక్షించుటగాక,

(2) పరస్పరవివాదములనుండి ప్రజలను సంరక్షించుటగాక,

(3) దేశమునకు వలయు విద్యావిధానముల నేర్పరచుటగాక,

  1. రుష్యావంటి యుద్దండరాష్ట్రములలో వ్యక్తిగతమగు ఆస్తియే యుండరాదనియు ప్రభుత్వమే సర్వవిధములయిన ఆస్తిని పరిపాలించి ప్రజలకు వారివారి పనినిబట్టి అవసరములనుబట్టి జీతము బత్తెము లిచ్చుచు బడిపిల్లలచదువులు ఇత్యాదులన్నియు సమష్టి సంస్థలలో జరుపజూచుచున్నారు.