పుట:Prabhutvamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

ప్రభుత్వము

ముగా చెప్పునంతటి స్వాతంత్ర్యము కలవారుగా నుండవలెను.

మూడుపాయములు

ఇట్టివారిని సంపాదించుటకు నాగరకరాష్ట్రములు మూడుపాయముల నవలంబించియున్నవి. మొదటి యుపాయము వారిని నియమించుపద్ధతికి సంబంధించినది. రెండవ యుపాయము వారి యధికారమునకు సంబంధించినది. మూడవయుపాయము వారు పొందవలసిన ప్రతిఫలమునకు సంబంధించినది.

న్యాయవిచారణాధికారులను నియమించు నధికారమును శాసననిర్మాణసభలు పెట్టుకొననగునాయని న నదియంత ఫలవంతమగునని చెప్పుటకురాదు. శాసననిర్మాణసభయం దొక్కకక్షి, యెల్లప్పుడును బలవత్తమముగా నుండును, కాబట్టి న్యాయవిచారణకర్త ఏకక్షికి చేరిన వాడోయను ఆలోచన రావచ్చును. నిజముగా న్యాయవిచారణ చేయవలసినవాడు ఏకక్షికిని చేరియుండరాదు. అది యట్లుండ శాసననిర్మాణముచేయు సభయే, శాసన వివరణకర్తలను నియమించుటకు, తీసివేయుటకు నధికారము కలదయినచో దాని యధికారము విపరీతము కావచ్చునని కొందఱ యభిప్రాయము. ఏవంవిధమగు నాక్షేపమే అధికారవర్గమువారు న్యాయవిచారణకర్తలను నియమింప రాదను సిద్ధాంతమునకు ఆధారమైనది. పోనిండు ప్రజాసమూహమే వీరిని నిర్వచింపవచ్చు నందమా ? న్యాయవిచారణకర్తల కార్యము సామాన్యముగాదు.