పుట:Prabhutvamu.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనవివరణస్వరూపము

101

నవునకునుగల విభేదములేమి, పౌరునకు ప్రభుత్వమునకు కల విభేదములలో ననేకములేమి పంచాయతుల మూలకముగా తీర్మానమగు చుండినవి. కాని పూర్వకాలములు మారి పరిపూర్ణ ప్రజాపరిపాలనము లేర్చడు భవిష్యత్కాలము లింకను రాకయుండు మధ్యకాలములందు చాల యెక్కువగా న్యాయవిచారణాథికారము, అనగా శాసనవివరణాధికారము, అధికారవర్గమువారి చేతుల లోనికే పోయినది. ప్రజాపరిపాలన తలసూప నారంభించినతోడనే మరల పంచాయతులకు బల మేర్పడుట సంభవించుచున్నది. న్యాయవిచారణ క్రమక్రమముగా మరల ప్రజలకే సంక్రమించుచున్నది. అందుచేత న్యాయవిచారణశాఖ ఎల్లదేశములలోను బహు జాగరూకతతో నియమించుచున్నారు. అధికారవర్గమునకు న్యాయవిచారణ శాఖ యంకితమయిపోయి ప్రజాపీడ జరుగకుండుట కెన్ని ఏర్పాటులు, కావింపవలయునో యేర్పాటులును నాగరకరాష్ట్రములు చేసికొనుచున్నవి.

రెండు ముఖ్యగుణములు

అందుచేతనే న్యాయవిచారణాధికారులు రెండు ముఖ్యగుణములు కలవారుగానుండుట యవసరమని సర్వరాష్ట్రములును అంగీకరించినవి (1) శాసనముల జ్ఞానము వారికి సంపూర్ణముగా నుండవలెను. ఇది సులభసాధ్యము కాదు. (2) వారు సంపూర్ణముగా నిష్పాక్షిక బుద్ధి కలవారుగా నుండవలెను. ప్రభుత్వమునకే వ్యతిరేకమయిన తీర్మానము చెప్పవలసివచ్చినను నిస్సంశయ