పుట:Prabandha-Ratnaavali.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58


సరిగా పద్యమున్నప్పుడు తిరిగి యదేయర్థముగల పద్యము శ్రీనాథుడు వ్రాయడు. కావున నిదియును కుమార నైషధము నందలిదే యనిగ్రహింపవలెను.

ఇందు వలన కుమారనైషధమున పద్యములు 19.

మల్హణ చరిత్ర

కుమార నైషధమునుండి 19 పద్యములను గ్రహించిన జగ్గన-మల్టణ చరిత్రనుండి మూడు పద్యములను మాత్రమే యుదాహరించుటచేత ఎఱ్ఱన కుమార నైషధము నుంచి రచనగల గ్రంథమని మనమంగీకరింపవచ్చును. మల్హణ చరిత్రపద్యములు (90-92). ఇది రెండు పరియాయములు ముద్రితమైనది.

1990 శృంగార గ్రంథమాల మదరాసు.
1940 శృంగార కావ్య గ్రంథమండలి బందరు.
ఇందలి పద్యము

క. కురువింద వజ్రమయ గో
పుర కాంతులవలనఁ బ్రొద్దుపోకలు రాకల్
పరికింప నరిదియయ్యెను
సరసిజ కైరవ వికాససంపద తెలియన్ ...........(1-12)

అనునది కుమారనైషధమునగలదు-79 పద్యము.

ఇందుదాహరింపబడినవానికి ముద్రణ ప్రతీ సంఖ్యలు,
90 సీ. కువలయ కమలాభినవ ..............1-33
91 చ.గములగు పద్మరాగము ..............1-35
92 సి. పగడపుఁ గంబాల

పెదపాటి సోమయ అరుణాచలపురాణములో నీ క్రింది పద్యము గలదు. (488)

సి, అంగయు క్తంబుగా నామ్నాయములు నాల్గు చదువంగ నేరని సద్విజాతి
బ్రహ్మపాద్మాది పురాణాగమేతిహా సము లెఱుంగని బ్రహ్మసంభవుండు
థాట్టవై శేషిక ప్రాధాకరాది శా స్త్రములాఱు చూడని ధరణిసురుడు
స్వకులోచితములైన సప్తతంతువులెల్లఁ బార మేమింపని బాడ బుండు