పుట:Prabandha-Ratnaavali.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55


కుంటముక్కల తిమ్మయ

శైవాచార సంగ్రహము

ఈతని గ్రంథమునుండి ఒక పద్య ముదాహరింపబడినది. అది 167 పద్యము విభూతి వర్ణన ఈ గ్రంథము ముద్రితమైనది (మదరాసు ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారము వారు 1961లో ప్రకటించిరి) ఇందు 167 వద్యము కపిలవర్ణము గోవు" అనునది. 1-26 పద్యముగా నున్నది.

నూతన కవి సూరన్న

ధనాభిరామము

ఇందుండి ఒక పద్య ముదాహరింపబడినది.

482. 'ఇరువది యాఱు వీక్షణము లెన్నగ" ఈ కావ్యము వావిళ్లవాZచే క్రీ. శ. 1950లో ప్రకటితము. అందు 482 పద్యము 2 అ . 45 పద్యముగా నున్నది.

ఈకావ్యము తెలుగు విమర్శకులు చదివినట్లు కాసరాదు. సొంఘికేతివృత్త మునకు సంబంధించినది. రూపము ధనము వీని రెండింటిలో నేది గొప్పది అని మన్మధుడును కుబేరుడును వాదించుకొని, ఒకరునొకరు గెలువ లేక పోయిరి. అప్పుడు శివుడు ప్రత్యక్షమై రెండును మానవ జీవితమున కావశ్యకములే యని వెల్లడించును. కథ దాక్షారామమునకు సంబంధించినది.

అన్నయ - సాముద్రికము

ఈ గ్రంథమున 148 144 పద్యము లిట్లున్నవి చౌడయ్య గంగరాజు సాముద్రిక శాస్త్రము

క. ఉదరంబు దరురోదర
సదృశంబై జఘనమతి విశాలంబైనన్
సుదతీరత్నంబునక
భ్యుదయంబుగ ధరణి యేలు పుత్రుఁడు పుట్టున్ , ........... 143
క. కడునిడుదయుఁ గడుకులుచయుఁ
గడువలుదయుఁ గడుకృశంబుఁ గడునల్లనిదిన్
గడు నెఱ్ఱని దగు మెయిగల
పడతింగీడనిరి మునులు వరమునిచరితా , ........... 144