పుట:Prabandha-Ratnaavali.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45

45 ఆ. నే దానవారినాభిదఘ్నమై వీథుల నేబులట్ల పొంగి పాఱుచుండఁ బవన బోయివచ్చు ప్రథమకేళీ జయ సారణములు పురము వారణములు.

మలయానిలము

144. సీ. ఘనసారకస్తూరికా గంధములనన్య గంధబంధంబుల గఱపి గఱపి

{

కుసుమితవల్లికాలసిత వీథులఁజొచ్చి

చనిసరోగృహములమునిగి మునిఁగి

సమధికాహర్యాంగ సంగీతములతోడ కన్నె తీగల కాట గఱపి గజపి

కుముదకుట్మలకుటీకోరకంబులుదూఱి

యలిదంపతుల నిద్ర తెలిపి తెలిపి

ఆ. వె. అనుదినంబునప్పురాంతికమ్మునగట్టి
వాలువోలే విప్రవరుఁడు వోలె
నట్టువొఱవోలె నచ్చిన చెలివోలె
మలయుచుండు మందమారుతంబు.

పై వివరణవలన తిక్కన విజయ సేనములో 18 పద్యములు. ఒక సీస పద్యమున రెండు పాదములు దొరికినవని గ్రహింపవలెను.

కే తన

ఇతఁడు తిక్కన పెదతండ్రి. ఈతఁడు కాదంబరీని పద్యకావ్యముగా వ్రాసెను. అందుండి రెండుపద్యము లుదాహృతములైనవి. (88-97). ఒకటి శార్దూలము ; రెండవది సీసము.

కేతన కాదంబరీ నుండి మటి రెండు పద్యములను కవిగా రుదాహరించినారు.

వేసవివర్ణన

సీ. కడు వేడి పెల్లెండ పుడమి పేల్చిన ! పొద్దు లాకాశ గతియ మేలని తలంప
హత్యా భిహతి లగ్గవాడి వియచ్చరు లవనిపై జనుట మేలని తలంప
వడవడగా నీళు లుడికిన జలచరుల్ వనచరవృత్తిమేలని తలంప
వనముల గార్చిచ్చు దనరిన వనచరు అంబు సంచరణమేలని తలంప