పుట:Prabandha-Ratnaavali.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40


ఇందువలన కళావిలాసమున మనకు లభించిన పద్యములైదని తెలియ వలెను. ఇందలి మన్మథస్తుతి లోకోత్తరమైనది. ఇతరకవులెవ్వరును చేయనిది.

అభిజగజెట్టి మన్మథుఁ డఖిలలోక
ములకు వేఱగొంగ జీవులమూలకంద
యతని యిలుసొచ్చి వెడలని యతఁడుగలఁడె
యతని యమ్ములఁబడకున్న యతఁడు గలఁడె.
.....................................................................(కవిగారి రచనలు, పీఠికలు పుట 2)

సోమేశ్వరుడు పాలపర్తి . (6-11-12 పద్యములు)

ఇచ్చట 'పాలపర్తి ' అని యుండుట సరి కాదు. అది "పాలకుర్తి " యని యుండవలెను. ఇది ఆంధ్ర సాహిత్య పరిషత్తువారి ఉదాహరణ గ్రంథములో గలదు. అచ్చటి వ్రాతప్రతినిబట్టి నేను నా ప్రతిలో సవరించినాను. ఇం దుదాహ రింపబడినవి రెండును సీసపద్యములే. అవి త్రిపురాసుర సంహారమును ప్రశం సించునవి ఇందలి రెండవపద్యము భావధ్వనికి ప్రశస్తమైన లక్ష్యము .

సి. వింటి క్రిందికి కొమ్ము వికలించి పేఱికిన
          భూకాంతకును నాభి పొలుప మిగిలె
నమ్ము పుచ్చుకొనంగ నమితతరంగముల్
         పాలసంద్రంబునఁ బ్రజ్వరిల్లె
బండికండులు రెండు పండ్లిగిలించిన
        గలువలు తామరల్ చెలిమి చేసె
వాజులఁ గొనివచ్చి వర రథంబునఁ బూన్ప
       జిచ్చుకు నాకలి చిచ్చు పుట్టె

సి. నారి సంధింప కశ్యపునారి వడకే
గోల సంధింప లచ్చికి గోల వుట్టె
విల్లు తెగ బాపి పరములు దైళ్ళ నేసి
తరిది విలుకాఁడ వైదువు శరభలింగ!

త్రిపురాసుర సంహార మింత భావధ్వని వైభవముతో వర్ణించిన వేఱొక కవి లేడు.