పుట:Prabandha-Ratnaavali.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34


ప్రభాకరశాస్త్రి గారి గ్రంథము నేడు అనగా ప్రథమముద్రణమున కేబది యెనిమిదేండ్లయిన తరువాత తిరిగి ముద్రణ భాగ్యమునందుట సాహితీ చరిత్ర కారులకు ముదావహమైన విషయము.

సంకలన గ్రంథములు వాజ్మయ చరిత్ర

పై మూడు గ్రంథములుు తెలుగు వాజ్మయచరిత్రలో నన్నయకు పూర్వమునుండి, క్రీ. శ. 18వ శతాబ్దినలుకు గల విస్మృతములైన కవి కావ్య ములను దెలుపుచున్నవి. వాజ్మయ చారిత్రక దృష్ట్యా పరిశీలించిన వాని వివరణ మిట్లుండును.

ప్రబంధరత్నావళి .......... నన్నయకు పూర్వ కవికృతులు క్రీ. శ. 1689
                                       వఱకుగల కాలమున నున్న కవులు, కావ్య
                                        ములను దెలుపును

సకలనీతి సమ్మతము........నన్నయనుండి క్రీ. శ. 1430 వరకు గల
                                       కవులు కావ్యములను దెలుపును

ప్రబంధమణిభూషణము. క్రీ. శ. 18, 17 శతాబ్దములలోనున్న కవులు
                                       కావ్యములు తెలుపును.

--

ఆధారములు

ప్రబంధమణిభూషణమున కాధారమైన తాళపత్ర గ్రంథమును కవిగారు పేర్కొ నలేదు - కాని ప్రభాకరశాస్త్రి గారు ప్రబంధరత్నావళి పీఠికలో నిట్లు చెప్పినారు “కవిగారు ప్రబంధమణిభూషణమను పేరుతో ప్రచురించిన సంధాన మునకు ప్రతులు నాల్లైదు తంజావూరి పుస్తకళాలలో నున్నవి " (పుట 18)

దీనివలన - ప్రబంధమణిభూషణమునకు మూలము తంజావూరి పుస్తక శాలలోనున్న గ్రంథమనుట స్పష్టము.

సకలనీతి సమ్మతపు వ్రాతప్రతిని మాత్రము ఆత్మకూరు సంస్థ నాధీశ్వరులగు శ్రీమంతు రాజా ముక్కర సీతారామ బహద్దరు వారిచ్చినట్లు తెలిపినారు - (పుట 72 పునర్ముద్రణము).