పుట:Prabandha-Ratnaavali.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

తెలుగులో పూర్వకవుల కావ్యములను గూర్చి తెలిసికొనుటకు లక్షణ గ్రంథములును, సంకలన గ్రంథములును ప్రధానాధారములు. లక్షణ గ్రంథ ములలో అప్పకవీయము , రంగరాట్ఛందస్సు, సర్వలక్షణ సారసంగ్రహము మొదలైనవి మనకు పరిచితములైనవేగాని. అందుండి మనకు కాలగర్భమున నడగిపోయిన కావ్యములు చాల కొలదిగానే తెలియుటవల్ల వాజ్మయచరిత్ర కారుల కవి కొంతవఱకు మాత్రమే ఉపయోగకారులు.

అము ద్రితములైన లక్షణ గ్రంథము లింకను ఎన్నియో యున్నవి గాని యింతవజకు వానినిగూర్చే పరిశ్రమ యేలేదు వాని కూలంకష పరిశీలమువలన మన కీనాడు తెలియని ప్రాచీన కావ్యములు బయలుపడును పూర్తిగా పరిశీలితములైనగానీ వాజ్మయ చరిత్ర పూర్తికాదు.

సంకలన గ్రంథములు

మన యదృష్టవశమున సంకలన గ్రంథములు మానవల్లి రామకృష్ణ మహోదయులు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారి మూలమున వెలుగునకు వచ్చి, ఆంధ్ర వాజ్మయచరిత్రకారులకు విస్మృతములైన కావ్యములను, విస్మృతులైన కవులను పరిచయ మొనర్చినవి. అట్టి సంకలన గ్రంథములు మూడు.

1. ప్రబంధమణిభూషణము ----------- 1910. సంపాదకులు ----మానవల్లి కవిగారు,
2. సకల నీతి సమ్మతము ............1928. "
3.ప్రబంధరత్నావళి - ...................1018 సంపాదకులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారు,

మొదటి రెండును ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారిచే విపుల పీఠిక

లతో పునర్ముద్రితములైనవి 1[1]

  1. పీఠికిలకర్త నిరుదవోలు వేంకటరావు, సంపాదకులు డాక్టరు సి. యస్, ఆర్. అప్పారావు - (1870-71)