పుట:Prabandha-Ratnaavali.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27


మందలి వేములవాడకుఁగుదురకపోవుట తత్రత్యత్వమునకు బాధకము. కవిని గూర్చియుఁ గవికావ్యములను గూర్చియు నిన మిత్థమని నిర్ధారణ మేర్పడని యప్పుడీస్థలమును గూర్చి యింతచర్చ యెందులకు ?

మఱియు. రామయ్య పంతులుగారు 'ఘనుఁడన్ వేములవాడ' అన్న పద్య మున శ్రీరామమూర్తిగారు కల్పించిన' ‘వెలుంగాధీశ 'యన్న పాఠమునకు బదులుగా వీరేశలింగము పంతులు గారు 'తెలుంగాధీశ' యన్న పాఠముచు జెప్పి' రనియు , 'దెలుంగ్వధీశ ' యని కాని 'తెలుంగధీశ ' యని కాని యుండవలయునే కానీ 'తెలంగాధీశ ' యనుట వ్యాకరణదుష్ట మనియు నట్లు భీమకవి ప్రయోగింపఁ డనియు గర్జించి 'కళింగాధీశ 'యని చేర్చుకొని "కళింగాధీశ యను పాఠ మీప్ర తీతి కనుగుణము, సర్వవిధముల నిర్దుష్టము ; ఇదియే కవి ప్రయు క్తపాఠ మై యుండవలయును" అని వ్రాసిరి కాని యీపాఠము వీరి కెట్లు వచ్చినదో చెప్పనొల్లక పోయినారు కావుననే వీరేశ లింగము పంతులుగారు “తెలుంగాధీశ యన్న పాఠము వ్యాకరణ దుష్ట మగుటచే నది కళింగాధీశ యని యుండవలెనని యొక రసుచున్నారు" అని యది రామయ్యపంతులుగారు సంస్కరించిన పాఠ ముయిన ట్లభిప్రాయపడినారు. 'తెలుంగాధీశ ' యనుట వ్యాకరణదుష్ట మనెడు వాదము గ్రాహ్యము కాదు తద్భవ, దేశి, నామములకు" డుప్రత్యయము పరమగుచో కా రాదేశము వచ్చును. రంగఁడు, లింగఁడు, మారఁడు, సూరఁడు, గురువఁడు, తిప్పడు, మొ. ఇట్లే తెలుఁగఁడు కూడసు తెలుఁగ (డే తెలగడని కూడ మోఱెను. 'తెలుగుఁడు' అని యుండదు అన్నట్లుకూడఁ గానరాదు సంస్కృతస హూసఘటిత మగునప్పుడా యకారాంతరూపమే ప్రాతిపదిక మగును కళింగ గంగు, సాశ్వామందు అనురూపము లున్నను గంగ్వధీశుఁడు, మంగ్వధీశుఁడు, నని యుండదు. పంతులు గారు 'తెలుంగా ధీశ' యసుట వ్యాకరణదుష్ట మనునప్పుడు, శ్రీనాథక విసార్వభౌముని 'యక్షయ్యంబగు' పద్యమును మరచిపోయినారు. వీరేశలింగము పంతులుగారి పాఠము యుక్తమే. “సుచరి త్రాడ్యుని వత్సవాయతెలుఁగున్ క్షోణీశ చూడా మణిన్" అని కం. వీ. గారు ప్రచురించిరి గాని యదికూడ “వత్సవాయుతెల(ల) గక్షోణీశ చూడామణిన్ "అనియే యగునని నానమ్మకము.

ఇక నా 'కళింగాధీశ' యన్న పాఠమును రామయ్య పంతులుగారు నా చాటుపద్యమణిమంజరి నుండి ' గ్రహించి యుండవచ్చును. ప్రాచ్య లిఖితపుస్తక