పుట:Prabandha-Ratnaavali.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25


పంతులుగారు1 [1]దక్షిణదేశమున దొరకిన యొక్క ప్రతిలో మాత్రమున్నవని యేడు పద్యము లవతారిక యను పేర గవిజనాశ్రయమునఁ బ్రకటించినారు. ఇంచు మించుగ ముప్పదినలువది కవి జసాశ్రయపుఁ దాళపత్రప్రతు లాంధ్రదేశమునను దక్షిణ దేశమున బరిశీలించితిని గాని యా పద్యములు నాకెందును గాన రాలేదు. పంతులుగా రాపద్యములను గూర్చి యిట్లు వ్రాసినారు. “ఈ యవతారిక ప్రతిలో మాత్రముండుటచేఁ బ్రక్షిప్త మని తోఁపవచ్చును గాని, కవితా వైఖరిని బట్టిచూడ నది ప్రక్షి ప్రము కాడనియే నా నమ్మకము." పంతులుగారి నమ్మక మసమర్థమని నానమ్మము, అనంతునిచ్ఛందమందలి మొదటి పద్యమే యీష ద్భేదముతో నీయవతారికకు మొదటి పద్యముగా నున్నది.

క. శ్రీపల్లథు యతిగణసం, సేవిత పాదార విందుఁ జింతితఫలతున్ భాసజగురు సలఘుచ్ఛం, దోవినుతు మురారి భక్తితో వినుతింరున్. లేకపోయిసను భీమేశ నందన. ( డగుభీమక వి యిట్లు 'మురారి' నిష్టదైవముగా స్తుతించు సని సమ్మరాదు. కాన యాతనిది కానేరదు, ఇంక రెండవ పద్యము :

"క. శ్రీకరముగ రచనపై
లోకంబున సుకవివరులు లోలత్య బొగడన్
బ్రాకటముగ నీఛందము
లోకం బౌ ననఁగఁ దెలుఁగులో నానరింతున్.

ఇందుఁ బ్రాసమునకై శ్రీ కరముగ' ' లోకంబున' 'ప్రాకటముగ' 'లోకంబౌననఁగ' సని నాల్గుపడిఱాళ్ళు పడినవి. యతికై 'లోలత' వచ్చినది. కవి జనాశ్రయమందలి శైలికి నీపద్యముల శైలికిని బోలికయే లేదు. ఈ ఛందము తెల్గులో నొనరింతునని రచింపబోవువాఁ డెట్లు చెప్పఁగూడును? రచింపఁబోవు దశలో నీఛంద మనుటకుఁ బొసఁగుఁబా టెట్లు, కవి జనాశ్రయమును బఠించిన కవితాలుబ్దు డెవఁడో దాక్షిణాత్యుఁ డిటీవల నీ యవతారిక నైతిహ్యమును బట్టి

కూర్చిన ట్టిపద్యమే చెప్పక చెప్పుచున్నది. ఇట్టికవితా వైఖరిని బట్టి చూచి యట

  1. 1. కవిజనాశ్రయము శ్రీ రామయ్యపంతులుగారిచేఁ బ్రకటింపఁబడినది. అందు రెండవ పద్యమున “పరహిత చరితుండ నాద్రపదభక్తి మెయిన్" అను పారమున్నది. ఒక పత్రికలో “జితేంద్ర యని యున్నదనియు, నది కవి సమ్మతమైనచో “జినేంద్ర' యని యుండవలెననియు వారు వ్రాసిరి, అనేక తాళపత్రప్రతులలో 'జినేంద్ర' యన్న పాఠ మున్నది