పుట:Prabandha-Ratnaavali.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22


కేమి యాధారమో ? ప్రద్యుమ్న చరిత్రము చారికడ సమగ్రముగానుండెను గాఁబోలును. లేనిచో నదిచాలఁ బ్రౌఢమయినదనియు నన్నూటయేఁబదికిఁ బై పడిన పద్యములు యత్కర్తృకములో, యేకృతులలోనివో తమ రేఱుగ రాకపోయిన యాప్రబంధ మణిభూషణమున, 113-వ పద్యమొకటి మాత్రమే ప్రద్యుమ్న చరిత్రమునుండి గ్రహింపఁబడినదనియు నెట్లు చెప్పఁగల్గుదురు? కవిగారు ప్రబంధమణిభూషణ మను పేరుతోఁ బ్రచురించిన సంధాసమునకుఁ బ్రతులు నాల్గయిదు తంజాపురపుఁ బుస్తకశాలలోనున్నవి. కాని వానియందు లేనిపద్యముల నేకములు వీరి ముద్రణమునఁ జేరీసవి. వీరే యేప్రతులను బట్టి యాగ్రంథమును ముద్రింపఁగల్గినారో తెలియదు.

పోతరాజు :- ఈతఁడొక (బేతాళ పంచవింశతి) రచియించెనట : శ్రీ రాము కృష్ణకవిగారు తమకు దొరికిన కవిభల్లటుని విక్రమార్క చరిత్ర బేతాళ పంచమిశతి యందలి వని యుదాహరించిన పద్యములు కూచిరాజు ఎఱ్ఱయ రచించిన సకల కథానిధానమండలి బేతాళ పంచవింశతి కథలలోనివే. ఇటీవల నొకరు పంచవింశతి భాగము దొరికినది.1[1] ఆదీ యత్కృతియో ?

మల్లయ, నంది :- ఈతఁడును ఘంటసింగయయును గలసి కవులుగదా ! అఘోరశివాచార్య దక్షిణామూర్తి శివాచార్యులకు వీరు శిష్యులు. విద్యానగరమున శివాచార్య' పీఠమొకటి యాకాలముననుండెను.అందు వైరాగ్యశివాచార్యా ఘోరశివాచార్యదక్షిణామూ ర్తి శివాచార్యాదు లధిష్ఠాతలు. ఆఘోర శివాచార్యాదుల కృతులు శైవాగమగ్రంథములు శైవతత్త్వామృగాదులు పెక్కు లున్నవి. లక్షద్వయాధ్యాపకుఁడట యమోరశివుఁడు. మా. రా, కవిగారు క్రీడాభి రామపీఠిక లో "......అవి రుచ్యములుగావని సంజసింగసము ఘంట మల్లయయు-(ఇంటి పేర్లుఁ బేర్లును దార్చారు.) గలసి యార్వీటి తిమ్మరాజున కంకితముగా షష్టస్కంధమును శృంగారషష్ఠ మసు పేరుతో రచించిరి" ఆని వ్రాసి నారు. నందిమల్లయ ఘంటసింగయలు ప్రసిద్ధులు. వారుగాక వీరు వ్రాసిన. విధముగాఁగూడ నిర్వురున్నారా ? ఏమో : లక్షణ గ్రంశకర్తలు రాచమల్లు నా శృంగారషష్ఠమని యుదాహరింతురు. ఇదియేట్లో ఆ ప్రయోగ రత్నాకరమున శృంగారషష్ఠమందలిదిగా నీవద్య ముదాహృతము.


1.

  1. ప్రాచ్య లిఖిత పుస్తకణాలలో నున్నది.