పుట:Prabandha-Ratnaavali.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21


నిల మంచుఁ గుంచానఁ గొలువ రేబవలు
సేయ నాక సమునఁ జిత్రరూపములు,
వ్రాయ వాయువుఁ బట్ట వడగళ్లుగుళ్లు
గట్ట వెన్నెలగుంపుగాఁ జేయవచ్చి
పుట్టినప్పుడే నేర్చు బుద్ధుల ప్రోక."

"సీ. నేలయు నిఁగియుఁ దాలముల్ వాయింప నెండమావులఁ బట్ట బండతలయు,
మ్రోకాలు ముడిపెట్ట రోకటఁ జిగుళులు గోయఁ జట్రాతి పైఁ గ్రుంగ నిడుపు,
లేక చిత్రము వ్రాయ నాకాశమునఁ దాఁపరము నిడ మంచుఁ గుంచములఁగొలువ
నేనుంగుపురు డోమ దానార గొన గాలి గంటిడ నిసుమున గట్టు దాల్ప,

గీ, నీరినడుము డెంప నేలఁ దెన్నుండి చే
వెల్పఁ గలిగియుఁ ద్రచ్చి వెన్న గొనగఁ
గడవ నేర్పు గలిగి కందువు చూ నెఁడై
క తీగంటు లయిన యత్తగంతు. " కుమా. భా. 2-185.

ఇట్లియిర్వుర గ్రంథములనుండియు వలసినన్ని సంవాదములు వచ్చును. సులువుగా ద్వీపదలో సోమనాథుఁడు కూర్పఁగా నన్నె చోడఁ డిట్లు సీసపద్యమునఁ జేర్చుకొన్నా డేమో ![1] సుసూక్ష్మముగా నీయిర్వుర కృతులను బరిశీలించినచో నీవిషయము బయల్పడ గలదు. భాషావ్యుత్పత్తిలోఁ జోడఁ డును సోమనాథుఁడును గూడ సమధికులేయని యాయాగ్రంథములఁ జక్కం జదివి యెఱిగినవారు భావి:ంతు రని నా నమ్మకము.

పెద్దిరాజు, పొన్నాడ :- ప్రబంధమణిభూషణపుఁ బీఠిక లో శ్రీరామకృష్ణ కవిగా రిట్లు వ్రాసిరి. "విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణియుఁ1 బ్రద్యుమ్న చరితయు రచియించెను.రెండవకృతి చాలఁ బ్రౌఢమయినది. దానిలోనుండి 113-ప పచ్యము మాత్రమే గ్రహింపఁబడినది." కావ్యాలంకార చూడామణి కర్తయింటి పేరు విన్నకోట గదా! ప్రద్యుమ్న చరిత్రకర్త యింటి పేరు పొన్నాడ యని యిందున్నది. కవిగారట్లువ్రాయుట


1

  1. . కావ్యాలంకారచూడామణి " ఉల్లాసములు మాత్రము ముద్రింపఁబడెను. ఇంకను మఱి కొంత గ్రంధము ముద్రింపఁబడవలసి యున్నది.