పుట:Prabandha-Ratnaavali.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20


గావలయు ఎఱిఁగియుందురేని యనర్ఘ మగునీపాఠమును జూపకుండుట కేమికారణము ? తంజావూరు పుస్తకళాలలో నన్ని చోడని కుమారసంభవ మున్న దని యెల్లరు నెఱింగిన తర్వాత క్రీ. 1914 లో వీరు ప్రచురించిన కుమార సంభవపు రెండవభాగమున “చాళుక్యరాజు మొదలుగఁబలుపుర్" అనుపాఠాంతర మున్నట్లు తెలిపిరి. కాని యిప్పుడయినను దంజాపురపుఁ బుస్తకమును వీరు చూచినట్లు వ్రాయలేదు. కావున నీపాఠము మఱియొక ప్రతిలో జూచినా రేమే ? అత్యూహ లెందులకు ? తంజావూరుపుస్తక పాఠముమాత్రమే మనకిప్పుడు గ్రాహ్యము: శ్రీకవిగారిపాఠము గలమాతృక బయల్పడువఱకును. అట్టి ప్రత్యంత రము బయల్పడెనా యది పాఠాంతరముగాఁ గూర్చుకొందము. ఇక, “కాళుక్య రాజు మొదలుగ" నన్నప్పుడు రాజరాజనరేంద్రుఁడే యేల కారాదు , చోడఁడు నన్నయకంటెఁ బ్రాచీనుఁ డనుట కాధారములు తగినవి లేవు. శ్రీవీరేశలింగము పంతులుగారు నన్నిచోడని భాషాప్రయోగములను గూర్చి చేసిన యాక్షేపములు నిలువజాలనివి.1[1] పోనీనెల్ల నిర్వచించుట కిక్కడ స్థలము జాలదు పాల్కురికి సోమనాధుఁడు 1190 ప్రాంతముల నున్నవాఁ డను పంతులవారి సిద్ధాంతము పోలును నన్నీ చోడఁ డంతకు ముందటివాఁడో వెనుకటివాఁడో సిద్ధాంత మేర్పడ లేదుగదా ! ఈయిర్వురిలో నొకనిపుస్తకము నింకొకడు చక్కగా సంగ్ర హించు కొన్నాఁడు. ఇది చదివిచూడుఁడు !

"ద్వి, నెట్టన నేలకు నింగికి సూత్ర,
పట్ట మ్రోకాళ్లకు బట్టతలలకు
ముడిపెట్టఁ దననీడ గడవంగఁ బాలు ,
వడి నెండ మావులకడగళ్లు కట్ట ;
పాయక రెండుగాఁ బారెడునీరు,
వ్రేయఁ బుట్టున్ను గోరో యని యమ్మ ;
జానార యొలువఁ జట్రాతిపైఁ గ్రుంక,
నేనుంగుపురు డోమ నిసుము త్రాడ్పేన ;
లలిగొన దెసలు తాళములు వాయింపఁ,
శెలఁగుచు రోకటఁ జిగురులు గోయ ;
కలి వెన్న పుచ్చఁ గొందలు దొతిఁ బేర్ప,

1

  1. ఆంధ్రకవుల చరిత్రము 1 భాగము.