పుట:Prabandha-Ratnaavali.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరత్నావళి 133

తాంత్యశ్రమంబును, సంతానవాంఛయు, గర్భలక్షణంబును పుత్త్రోదయంబును, బాలెంతలక్షణంబును, బాలక్రీడయు, శైశవంబును, యౌవనప్రాదుర్భావంబును, సాముద్రికంబును, [2ఆ] రాజనీతియు, సేవకనీతియు లోకనీతియు, సుజనప్రవర్తనంబును, గుజనవ్యాప్తియు, నన్యాపదేశంబులును, సూర్యాస్తమానంబును సాంధ్యరాగంబును, సాయంకాలసమీరణంబును, దీపకళికావిధానంబును, విదియచందురుని చందంబునుఁ, దారకావర్ణనంబును, జక్రవాకవియోగంబును, విటవిడంబనలక్షణశృంగారంబులును, విటలక్షణంబును, వేశ్యాలక్షణంబును, గుటీ వేశ్యాచేష్టలును, వేశ్యమాతృప్రగల్భంబులును, భద్రదత్తకకూచిమారపాంచాలలక్షణంబులును, జిత్తినీహస్తినీశంఖినీపద్మినీజాతిప్రకారంబును, బాలాయౌవనాప్రౌఢాలోలాలక్షణంబులును, గూటప్రకారంబును రతివిశేషంబును, రతివర్ణనంబును, గళాస్థానవిశేషంబులును, బ్రణయకలహంబును, నందుఁ గూర్మి గలుగుటయు, నంధకారంబును, నిశివిడంబంబును, జారసంచారలక్షణంబును, జంద్రోదయంబును, జంద్రకిరణలాంఛనచంద్రికావిభ్రమంబులును, జకోరికావిభ్రమంబును, జకోరికావిహారంబును, వేగుఁజుక్క పొడుచుటయుఁ, గుక్కుటారావంబును, జంద్రతారకాస్తమానంబులును, బ్రత్యూషంబును, బ్రభాతమారుతంబును, నరుణోదయంబును, బ్రభాతరాగోదయంబును, [3ఆ] మధ్యాహ్నసూర్యవిడంబంబును, గ్రీష్మవర్షాశరద్ధేమంతశిశిరవసంతర్తువర్ణనంబులును, వనవిహారంబును, దశదోహదంబులును, నళికోకిలకీరహంసవిరావసంచారలక్షణంబులును, జలకేళియు, వస్త్రాభరణవర్ణనంబును, మధుపానసిద్ధపురుషప్రభావంబును, యోగినీప్రభావంబును, ద్యూతలక్షణంబును, మృగయావినోదంబులును, మృగలక్షణంబును, సముద్రవర్ణనంబును, దల్లంఘనవిధంబును, సేతుబంధంబును, నదీవర్ణనంబును, బుణ్యక్షేత్రప్రభావంబును, వ్రతమాహాత్మ్యంబును, గిరివర్ణనంబును, నారదాగస్త్యాదిమహర్షిప్రభావంబులును, వైరాగ్యయోగతపోలక్షణంబులును, దపోవిఘ్నంబును, దేవతాప్రత్యక్షంబులును, దండయాత్రయు, శంఖభేరీరవంబులును, గుణధ్వనియు, రథాస్త్రవేగంబులును, బాణపాతంబును, బ్రతిజ్ఞయు, వీరాలాపంబులును, దూతవాక్యంబులును, హీనాధిక్యంబులును, రణప్రకారంబును, మల్లయుద్ధంబును, రణభయంబును, రణాంత్యంబును, లోభదైన్యగుణంబులును, మనోవ్యధయును, ధనికదారిద్ర్యక్షుద్వార్ధకలక్షణంబులును, రోదనంబును, శకునంబును, స్వప్నఫలంబును, దిగ్విజయంబును, ధర్మోపదేశం