పుట:Prabandha-Ratnaavali.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132 ప్రబంధరత్నావళి

తే. మల్లప్రెగ్గడ వీరనామాత్యపుత్త్రి
రామ నభిరామ గుణధామ రామనామ
కామినీమణిఁ బెండ్లియై ఘనగృహస్థ
మహిమఁ జెలువొందు జగ్గన మంత్రివరుఁడ. 21

షష్ఠ్యంతములు

క. శ్రీరమణీరమణునకును
నారదశుకజనకసనకనలినాసనహృ
న్నీరజనిరతోపాసన
కారణపదకమలయుగళకలితాకృతికిన్. 22

... ... ... ... ...

వ. ఏను విన్నవింపఁబూనిన ప్రబంధరత్నాకరంబునకు వర్ణనాక్రమం బెట్టిదనిన నారాయణస్తుతియు శంకరప్రభావంబును ద్రిపురవిజయాభిరామంబును నర్ధనారీశ్వరంబును హరిహరాత్మకంబును బ్రహ్మస్తుతియుఁ ద్రిమూర్తిస్తుతియు లక్ష్మీగౌరీసరస్వతీప్రభావంబును నష్టదిక్పాలకాది దేవతాప్రార్థనంబును వినాయకషణ్ముఖ మైలారగుణోత్కర్షయుఁ జంద్రాదిత్యులప్రభావంబును వైనతేయశేషవ్యాసవాల్మీకిసుకవిప్రశంసయుఁ గవిత్వలక్షణంబును గుకవినిరసనంబును మన్మథవిభ్రమంబును బురవర్ణనయుఁ బ్రాకారపరిఖాప్రాసాదధ్వజసాలభంజికాగోపురదేవాలయగృహవిలసనంబును బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రజాతి విస్తారంబును విపణివిభ్రమంబును బుష్పలావికాభిరామంబును వారాంగనావర్ణనయుఁ బామరభామనీచతురతయుఁ జెంచెతల యొప్పును బుణ్యాంగనాజనవిశేషంబును నుద్యానవనసరోవరచయసుభగంబును మలయమారుతంబును గజాశ్వపదాతివర్గవిలసితంబును [1ఆ] నాయకోత్కర్షయు సభావర్ణనయు నృత్తగీతవాద్య సాహిత్యమంజసంబును నాశీర్వాదంబును నీరాజనవిధానంబును ఛప్పన్నదేశంబుల నామంబులును రాజ్యపరిపాలనంబును స్త్రీవర్ణనయు నవలోకనంబులును నన్యోన్యవీక్షణంబును దశావస్థలును స్త్రీపురుషవిరహంబులును విరహభ్రాంతియు శిశిరోపచారంబులును సఖీవాక్యంబులును మన్మథచంద్రాదిప్రార్థనంబులును దద్దూషణంబులును వైవాహిక పతివ్రతా లక్షణంబులును నభ్యంగనవిధియును సూపకారవిరాజితంబును విషనిర్విషవిశేషంబులును భోజనమజ్జనతాంబూలంబులును గేళీగృహంబులును సురతప్రకారంబును సుర