పుట:Prabandha-Ratnaavali.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15

“చ. కవితకు ముఖ్యుఁ డీతఁ డనఁ గామితవస్తువు లిచ్చువాఁడు నా
     నవరసభావకుం డితఁ డనన్ బురుషార్థపరాయణుండు నా
     నవునన రాజనీతివిషయజ్ఞుఁ డితం డనఁ గీర్తిచంద్రికా
     ధవళితదిక్కుఁడై నెగడె ధన్యుఁడు కేతనమంత్రి యిమ్మహిన్. (దశకుమార)

కాదంబరీదశకుమారచరిత్రములందు రసవత్తర మగుకాదంబరిని వీడి రెండవది యగు దశకుమారచరిత్రమునే కేతన తెలిఁగించుటకుఁ గారణము తతఃపూర్వమే యది తెలిఁగింపఁబడియుండుట యగునేమో? తన కృతికిఁ బతి యగుచున్న తిక్కనసోమయజికృతులనే పేర్కొనని యీయభినవదండి యిఁక నాతనికిఁ బెదతండ్రి యగువాని కృతిని బేర్కొనక పోవుటలో నసందర్భ మేమి యుండును? కాఁబట్టి యీ కాదంబరీకర్త కేతన తిక్కన పెద్దతండ్రి కేతన కాఁ గూడును. ఇక నా కువలయాశ్వచరిత్రకర్త కేతన ప్రెగ్గడ యేతఁడో? ఇది యెల్ల నానుమానికమే.

కొమ్మయ, నిశ్శంక : -- ఈతని వీరమాహేశ్వరము దొరకలేదు. శివలీలావిలాసము[1] రెండాశ్వాసములు మాత్రము చేకూఱెను.

గంగరాజు (గంగాధరుఁడు) చిరుమూరి :- రా. బ. వీరేశలింగము పంతులుగారు కవులచరిత్ర ప్రథమభాగ పీఠిక లో నైరావతచరిత్ర మీతని కృతిగా వ్రాసినారు. ఐరావతచరిత్ర ప్రతులు రెండు నే నెఱుంగుదును.[2] రెండింటను బీఠికాగద్యములు లేవు. కృతిమంచిది. చిన్నది. కథ భారతేతిహాసప్రసక్తము. కాని సంస్కృతాంధ్రభారతములం దాకథ గానరాదు. కర్ణాటభారతమందు మాత్ర మున్నది. ఆంధ్రమున వేఱుగ నున్నయీకృతి యత్కర్తృకమో నా కెఱుఁగరాలేదు. గంగరాజుకృతి యని మీ రెట్లు వ్రాయఁగల్లితి రని శ్రీ వీరేశలింగముపంతుల వారికి వ్రాసి కనుఁగొంటిని. శ్రీరామకృష్ణకవిగా రపూర్వవాఙ్మయపరిశోధన మను పేరఁ బ్రచురించిన యుపన్యాసమునఁ జూచి వ్రాసితిమని

  1. ఇది నాదగ్గరనున్నది. తప్పులకుప్ప. ఆరంభము రెండుకాగితములుపోయినవి. మచిలీపట్టణములో నున్న యిమ్మానేని వీరేశలింగమునాయనిగారివలనఁ జేకుఱినది.
  2. ఒకటి ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నున్నది, వేఱొకటి విశాఖపట్టణమున శ్రీ పరవస్తువారి యార్షపుస్తకశాలలో నున్నది.