పుట:Prabandha-Ratnaavali.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12


"ప్రమాణ మకలంకస్య పూజ్యపాదస్య లక్షణమ్"[1] అని వికృతివివేకమున బేర్కోఁబడిన యకలంకుఁడు కర్ణాటకవ్యాకరణమును రచించిన యకలంకుఁ డనియు, నాతఁడు క్రీ శ. 1604 లో నుండెను గావున నది యహోబలపండితుని కాలముననే సృష్టింపబడియె ననియుఁ గ్రొత్త వెల్వరించిన కవులచరిత్రమున విశేషవిషయము చేర్చినారు. ఇది సిద్ధాంతము కానేరదు. అకలంకుఁడు ప్రాచీనుఁ డున్నాడు. ప్రాకృతవ్యాకరణకర్తలలోఁ బూజ్యపాదుఁడు ప్రాచీనతముఁడు; ప్రసిద్ధుడు; క్రై 1490 ప్రాంతమున 'నౌదార్యచింతామణి'[2] యను ప్రాకృతవ్యాకరణము రచించిన శ్రుతసాగరుఁడు వీరిని బేర్కొన్నాడు. వికృతివివేకమునఁ బేర్కొనఁబడినవారు వీ రేలకారాదు. ఆ శ్లోకము లివి:–

“సమంతభద్రై రపి పూజ్యపాదైః కలంకముక్తై రకలంకదేవైః
యదుక్త మప్రాకృత మర్థసారం త త్ప్రాకృతం చ శ్రుతసాగరేణ
శ్రీపూజ్యపాదసూరి ర్విద్యానందీ సమంతభద్రగురుః
శ్రీమదకలంకదేవో జినదేవో మంగళం దిశతు.

శ్రీ పూజ్యపాదనకలంకసమంతభద్ర
శ్రీ కుందకుందజినచంద్రవిశాఖసంజ్ఞాః
శ్రీ మాఘనందిశివకోటిశివాయనాఖ్యాః
విద్యాచనంది గురవశ్శ మమీ దిశంతు.”

సమయసంకోచముచే నీవిషయ మింతట విడిచెదను. బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు,


“క.

మగణముఁ గదియ రగణము
వగవక కృతిమొదుట నిలుపు వానికి మరణం
బగు నిక్క మండ్రు మడియఁడె
యగునని యిడి తొల్లి టెంకణాదిత్యుఁ డనిన్.”

అను పద్య మధర్వణాచార్యుని ఛందమందలిదని కుమారసంభవ పీఠికలోఁ జేర్చినారు. వారు దీని నేదేని లక్షణగ్రంథమును జూచి కైకొనిరో యధ

  1. జైనులకు:- శ్లో॥ ప్రమాణకలంకస్య పూజ్యపాదస్య శాసనమ్। ద్విస ధాన కవేః కావ్యం రత్నత్రయమిదంస్మృతమ్.
  2. ఇది విశాఖపట్టణమున శ్రీపరవస్తువారి యార్షపుస్తకశాలలో నున్నది.