పోతన వేమనల యుగము.
రాజులను (మనుజేశ్వరాధములనుచున్నాడు. వారివలన కొన్ని సొమ్ములు, పురములు వాహనములు పుచ్చుకొని నరకమునబడి పోవుటకిచ్చగింపక, స్వార్ధపరత్వముమాని పరమార్థ చింతనముతో భాగవతమును రచియించి రామునకంకితముచేసి జన్మము సఫలము చేసికొనెను.
ఇక వేమన యన్ననో చాల తెలివిగలవాడు. చదువుకొనినవాఁడు; మంచి కుటుంబములో నివాఁడు. అతడు జ్ఞాని యోగి. ఇతనికి హేమకార విద్య తెలియునని పలువురితని నాశ్రయించి తిరుగుదుండిరి కాని, ఇతఁడు నారి సాహాయ్యము నపేక్షింపక, భోగములను త్యజించి, ఊరూరుఁ దిరుగుచు, ధనము నార్జించుపనిమాని తత్వజ్ఞానము నుపదేశించుచు, తాను చూచిన ఆచారవ్యవహారములను విమర్శించుచు, నీతులను బోధించుచు, స్వార్ధ త్యాగము చేసెను.
పోతనకాలము పదునైదవ శతాబ్దియని నిర్వివాదాంశము అయినను, ఇతఁడే ప్రదేశమున జన్మించెను, ఎచ్చటనుండెను, ఎచ్చట నాంధ్ర భాగవతమును రచించె నన్న విషయము తగవులకు చోటిచ్చినది. ఆయన 'ఏకశిలానగరమని చెప్పినాడు. ఇది ఓరుగల్లా? ఒంటిమెట్టయా? ఇందు రెండు కక్షులవారు బయలుదేరి తగవులాడిరి. ఈ తగవులతో మనకుఁబసైలేదు. ఆశాలమున నీ రెండు చోటులను గల రాజకీయ సాంఘికముత