చేస్తున్నారు. ఇప్పుడిదొక మోడల్. క్రమంగా ఈ భాష మాట్లాడేవారు పెరిగారు. ఇప్పుడు వేల్ష్ భాషను కాదనడం చాలా కష్టం. బ్రిటిష్ ప్రభుత్వపు రాజకీయ సంకల్పం దీనికి ఎంతో తోడ్పడినా క్రిస్టల్గారి కృషితోనే ఇది సాధ్యమైంది. ప్రయత్నిస్తే ఐరిష్, స్కాట్ భాషల్ని కూడా నిలబెట్టవచ్చు అనేది ఆయన ధీమా.
ఒకప్పుడు ఇంగ్లీషు బ్రిటిష్ వారి భాష. ఇప్పుడది అమెరికన్ల భాష కూడా. అయితే అసలు విషయం ఏమంటే ఈ రెండు దేశాల మొత్తం ప్రజల కంటే ఇండియాలో ఇంగ్లీషు మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ. 150 కోట్ల మంది ప్రపంచం మొత్తం మీద ఇంగ్లీషు మాట్లాడుతుంటే 25కోట్ల మంది మాట్లాడే అమెరికన్ ఇంగ్లీషు ఇప్పుడు రాజ్యం చేస్తోంది. అమెరికా ఇతర రంగాల ఆధిపత్యం భాషలోనూ ప్రతిబింబిస్తోంది. ఇదొక సమస్యగా కన్పిస్తున్నమాట నిజమే. కానీ ఈ పరిస్థితీ మారుతోంది. ఇతర దేశీయులు ఇంగ్లీషు ప్రాబల్యం కూడా పెరుగుతోంది. క్రమంగా ఇంగ్లీషు ఒక 'కాస్మోపాలిటన్' భాషగా మారుతోంది. ఈ క్రమం చాలా వేగంగా జరుగుతోంది అంటారు క్రిస్టల్.
మనకు మరో భయం కూడా ఉంది. ప్రతి భాషలో చాలా మార్పులొస్తున్నాయి. ఈ మార్పులు ఈ భాషల మూల స్వభావాన్ని చెడగొడుతున్నాయి. అసలీ భాష లేదా అన్పించేలా ఉంది స్థితి. ఇదీ మన భయం.
‘వాస్తవానికి భాషలు మారుతున్నాయి. మారడం అంటే చెడిపోవడం, నష్టపోవడం అనుకోడం తప్పు. ప్రజల భాష ఎప్పుడూ మారుతుంది. ఎందుకంటే ప్రజలు మారతారు గాబట్టి. ఇంకా చెప్పాలంటే భాషల్లోని మార్పులవల్ల ఆ ఆ భాషలకి మేలే జరుగుతుంది. అవి మరింత సుసంపన్నం అవుతున్నాయి. ఇంగ్లీషులోకి గత వెయ్యేళ్లలో 350 భాషల నుంచి పదజాలం వచ్చి చేరింది. ఇప్పుడు 80 శాతం ఆంగ్లపదాలు అసలు ఆంగ్ల పదాలుకావు. ఫ్రెంచి, లాటిన్ స్పానిష్ భాషల్నించీ భారతీయ భాషల్నించీ ఇంగ్లీషు ఈ పదజాలాన్ని స్వీకరించింది. ఇలాంటి ఇంగ్లీషు లేకపోతే షేక్స్పియరే లేడు! ఒకసారి షేక్స్పియర్ సాహిత్యాన్ని చూస్తే ఈ సంగతి తెలుస్తుంది అనేది క్రిస్టల్గారు పై ప్రశ్నకిచ్చే సమాధానం.
ఎలక్ట్రానిక్ ఛాటింగ్, ఇన్స్టాంట్ మెస్సేజస్ వచ్చాక పరిస్థితి ఏమిటి? వీటి భాష మనం మాట్లాడే భాష కాదు. రాసే భాషా కాదు. ఈ కొత్త ఎలక్ట్రానిక్ భాష రాసే భాషకూ, మాట్లాడే భాషకూ మధ్య సరిహద్దుల్ని చెరిపేస్తోంది. ఈ భాషలకు విరామ చిహ్నాలుండవు. వాక్యాలు వాక్యాలుగా ఉండవు. ఛాటింగ్లోనైతే ఒకేసారి ఎంతో మందికి సమాచారం అందిస్తాం. అప్పుడు మరీ మన భాష వికృతం అవుతోంది. సహజంగానే ఈ ఆందోళన మనకు రావచ్చు. మనం వారసత్వంగా నమ్ముకొన్నదంతా కరిగిపోతున్నట్టు కన్పించవచ్చు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అన్పించవచ్చు.
ఈ ఆందోళన అనవసరం అంటాడు క్రిస్టల్. ఎలక్ట్రానిక్ భాషను ఆయన 'Netspeak' అంటారు.
'Netspeak' రాసే భాషకూ మాట్లాడే భాషకూ సరిహద్దులు చెరిపేస్తున్నదనడం అవాస్తవం. కొన్ని కొత్త మెళకువలు, పద్ధతులు పాటిస్తున్నంత మాత్రాన మన సాంప్రదాయక భాషా రీతులు తారుమారవు తున్నాయను కోనక్కర లేదు. ఇ.మెయిల్స్కైతే ఎదుటి వారి స్పందనతో సంబంధం లేదు. ఛాటింగ్‌లో ఎంతోమందితో మాట్లాడేపుడు ఆ భాషా ధోరణి (Sequence) వేగంగా ఉంటుంది. తమ అవసరాలకు తగ్గట్టు ఈ ధోరణి వచ్చింది. అంతమాత్రాన ఇదొక పద్దఎతై పోతుందనుకోవడం పొరపాటు.
పోతే ఇ-మెయిల్ భాషవల్ల భాషోపయోగంలో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. ఇ-మెయిల్ చాలా సంక్షిప్తంగా ఉండాలి. అదే సందర్భంలో మనం చెప్పదల్చుకొన్నది స్పష్టంగా చెప్పాలి. లేకుంటే మన సమయం వ్యర్ధం. సొమ్ము వ్యర్ధం. త్వరగా కూడా చెప్పాలి. అందు
పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 73