Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక్కడ జరిగింది కొత్తదాన్ని నేర్చుకోవడం కంటే అంతర్లీనంగా ఉన్న ఒక సామర్ధ్యాన్ని వెలికి తీయడం అనడం మేలు.

ఈ ప్రక్రియలో బిడ్డ గ్రహిస్తున్నదంతా సహజమైంది. తనకు అవసరమైంది (relevant) కృతిమమైందీ అనవసరమైందీ కాదు.

ఒక స్వేచ్ఛా వాతావరణం ఇక్కడుంది. Input తప్ప Outputతో ఇక్కడ సంబంధం లేదు.

నేర్చుకోవడం - పొందడం

ఇప్పటిదాకా భాషని 'నేర్చుకోవడం' ఎలా అని మనం తర్కించాము. అసలు నేర్చుకోవడం (Learning) ఇక్కడ లేదు. పొందడం (Acqusition) మాతమ్రే ఉంది. ఈ రెండింటికీ తేడా ఏమిటి?

నేర్చుకోడంలో పట్టుబట్టి తాను నేర్చుకొంటున్నాన్న స్పృహ ఉంటుంది. పొందడంలో ఆ స్పృహ ఉండదు. నేర్చుకోవడానికి కొన్ని పద్ధతులుంటాయి. సాధనాలుంటాయి. పొందడానికి ఇవన్నీ ఉండవు. భాషలు అయితే ఒక క్రమం మనం నేర్పేటపుడు పాటిస్తాం. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం (LSRW) అని ముక్కలు చేస్తాం. పొందేటపుడు ఈ క్రమం ఉండదు. నేర్చుకొనేపుడు మొదట అఢరాలు, తర్వాత పదాలు, ఆ తర్వాత వాక్యాలు ఇలా ముక్కలు ముక్కలుగా మొదలెడతాం. పొందడం మొత్తంగానే ఉంటుందితప్ప ముక్కలుగా కాదు.

నేర్చుకోవడంలో అభ్యాసాలుంటాయి. తప్పులు సరిచెయ్యడం ఉంటుంది. పొందడంలో ఇవి ఉండవు. ఒక ప్రవాహంగా సాగిపోతుంది. సారాంశం తప్ప ఇక్కడ ప్రతిదీ ఆచితూచి పరీక్షించి వాడడం ఉండదు. ఈ పొందడానికొక వాతావరణం అవసరం. సహజసిద్ధమైన సంభాషణలు, పాటలు, ఆహ్వానాలు, అభినందనలు, ఆదేశాలు, అభినయాలు, ఉపన్యాసాలు, ఉత్తరాలు, చిత్రపటాలు, వార్తలు, రాతలు పజిల్స్ ఇలా ఎనైన చెప్పు కోవచ్చు. ఇవన్నీ బిడ్డచుట్టూ ఉంటే, వీటితో బిడ్డ నిరంతరం అనుబంధం కల్గి ఉంటే దాన్ని వాతావరణం అంటాం. ఈ వాతావరణమే భాషను పొందడానికి అన్నిటికన్నా కీలకం.

భాష వేరు, భావం వేరూగాదు. కాళిదాసు 'వాగర్ధా వివసంపృక్తౌ' (భాష, భావంలా కలిసివుండే ఆది దంపతులు) అని ఊరకే అనలేదు. అవి రెండూ విడదీయరానివి. ఒక వ్యక్తికి భాష రావాలంటే భావాన్ని రేకెత్తించాలి. అతన్ని ఆలోచింపజెయ్యాలి. స్పందింప జెయ్యాలి. అందులోంచి భాష ఉత్పన్నమవుతుంది. అనుభవాల వ్యక్తీకరణ ఇందులో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పొందడం ఈ రూపంలో ఉంటుంది.

ఇంగ్లీషునూ ఇలానే పొందవచ్చు

ఇక ఇప్పుడు మనం మన తరగతి గదికి వద్దాం. ఆంగ్ల బోధనలోకి అడుగుపెడదాం.

ఆంగ్ల భాషా వాతావరణం మన క్లాసులో ఏముంది? అనుభవాలు ఉన్నాయా? వ్యక్తీకరణ, తప్పనిసరైన భావోద్రేకం ఉందా? ఆలోచనల్ని తట్టి లేపగల్గుతున్నాయా? వ్యక్తీకరించే అవసరం, అవకాశం మనం కల్పిస్తున్నామా?

దీనికో ఉదాహరణ చూద్దాం. టీచరు పిల్లల పేర్లని అడిగి తెలుసుకొంటాడు. తర్వాత 'Do you know my name' అంటాడు. పిల్లలు 'No' అని జవాబు చెపుతారు. అప్పుడు టీచరు మళ్లీ My name starts with letter 'S’ అంటారు. ఈ క్లూతో పిల్లలు ఆలోచిస్తారు. టీచరు పేరు వాళ్లు చెపుతారు.

మనం ఎప్పుడూ ప్రత్యక్షంగా తప్పుల్ని సరిచెయ్య కూడదు. "మీకు ఇది తెలియలేదు. చేతకాలేదు" అని చెప్పకూడదు. పరోక్షంగా సరిచెయ్యాలి. సరిజేస్తున్నట్టు అన్పించకుండానే బిడ్డ దీన్నుంచి దారిలోకి వస్తాడు. ఉదాహరణకి బిడ్డ 'I am sit in the chair' అంటుంది. ‘Are you sitting in the chair'అని టీచరు అనాలి.

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 66