భాషాబోధన అంటే భాషా
హృదయాన్ని పిల్లలకి పట్టివ్వడమే!
చదువు: భాష నేర్పడం మీద ఎన్నో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. మరి మీరు భాషా బోధనలో కీలకాంశంగా దేన్ని భావిస్తున్నారు?
శివరాం: భాషాబోధనకు సంబంధించిన మన ఆలోచనలన్నీ సాంకేతికాంశాలకు పరిమితమవుతున్నాయి. ఏవో కొన్ని ఎయిడ్స్ చెయ్యడం, కొన్ని టెక్నిక్కులు పిల్లల మీద ప్రయోగించడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. అసలు విషయం భాషకో హృదయం ఉంది. దానికో నాడి ఉంది. దాన్ని పట్టుకోవాలి. ఆ హృదయం లయలో ఉంటుంది. దాన్ని గుర్తించాలి. దీనికి భాషను ప్రేమించే స్వభావం మనకుండాలి. ఎలీనావాట్స్ తన పిల్లవాడికి గంటల తరబడి కథలు చెప్పేది. వాడు మహారాజులా వింటుండేవాడు. చాసో కథల్ని చదవండి. మాండలికం మనల్ని ఎంత ముగ్ధుల్ని చేస్తుందో! ఈ భాషా హృదయానిన ముందుగా మనం పట్టుకోవాలి. పిల్లలకు పట్టివ్వాలి. మనంఈ పని చెయ్యడం లేదు. ఆధునిక కవిత్వానికి కూడా వ్యాకరణ విశ్లేషణ చేసే బుద్ధి మనది. మనదంతా 'మొనాటనస్'గా ఉంటుంది. గుడ్డి కంఠస్తం చెయ్యడం తప్ప మనం పిల్లల్నించి ఏమీ ఆశించడం లేదు. భాషంటే ఏమిటి? మన బాధ, మన కసి అన్నీ అందులో ఉంటాయి. ఆటల్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి పిల్లల్ని electify చెయ్యించేది భాష. వైయుక్తికంగా నేర్పినా, సమష్టిగా నేర్పినా భాషకున్న హృదయాన్ని పట్టివ్వడమే భాషాబోధనలో కీలకాంశం. దురదృష్టవశాత్తు మన పాఠ్య పుస్తకాలు భాషను ఖూనీ చేస్తున్నాయి.
చదువు: మీరు చెపుతున్నది చాలా పెద్ద విషయం గా అన్పిస్తోంది. అనుభవంలోంచి కొంచెం వివరించండి.
శివరాం: ప్రతి సందర్భాన్ని మనం భాషలో ఇముడ్చుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు చాలా చిన్న విషయమైనా భాషా హృదయాన్ని పట్టిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పిల్లలెంత సృజనాత్మకంగా వ్యవహరిస్తోరో చూస్తే మనం ఆశ్చర్యపోతాం (ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు సిజిక్ 14 ఏళ్లలోపు పిల్లలు వేసిన బొమ్మలు చూసి ఇక తాను బొమ్మలు వెయ్యనవసరం లేదని మానుకొన్న సంగతి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి.)
శ్రీశ్రీ 'బాబాబీబీ' కవితకు (రెండు నెంబర్లకు) పారడీ చెప్పమంటే పిల్లలిలా చెప్పారు. ఇది చాలా చిన్నపిల్లలు చెప్పిన పారడీ. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెపుతూ పోతే కవిత ఎంత దూరం వెళ్లిందో మీరే చూడండి.
పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 56