భావిస్తున్నారు. విచిత్రమేమంటే బడిమొగం చూడని పిల్లవాడిలో సహజంగా అభివృద్ధి చెందిన ఏ నైపుణ్యమూ మన బడిలో పెరిగే పిల్లవాడి కన్నా అదనంగా ఉంటుం దనేది నిర్వివాదాంశం.
'మాట్లాడడం ఎలా?
ఇందులో విశేషం ఏముంది. ఏదైనా వైకల్యం వుంటే తప్ప పిల్లలందరూ బాగానే మాట్లాడతారు కదా. ప్రత్యేకంగా నేర్పించాల్సింది ఏముంది అని సగటు టీచర్లు, తల్లిదండ్రులు అనుకొంటుంటారు. మానవ వికాస దశల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఎలిజబెత్ హుర్లాక్ నుండి వైగోట్స్కీ వరకూ వ్యక్తిత్వానికి మాటతీరు ఒక గీటురాయిగా సూచించారు. అందుకే కాక్రాప్ట్, గోర్టాన్ ఆల్పోర్ట్ మొదలైన విద్యా మనో వైజ్ఞానికులు పిల్లల్లో స్పష్టమైన భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెంపొందించడానికి తరగతి గది బాధ్యత వహించాలని నిర్దేశించారు.
కథ చెప్పమని వేధించే పిల్లలకు మనం మొహం చాటేస్తుండటం దాపరికం లేని విషయమే. కథలు, పాటలు కాలక్షేపాలుగా, అనవసర అంశాలుగా అనుకొంటున్నాం. సంభాషణలు వినడం, కథలు వినడమే సరిగా మాట్లాడడానికి పునాది. అపుడు మాత్రమే ఎవరైనా తన భావాల్ని, అనుభూతుల్ని చక్కగా, స్పష్టంగా చెప్పడానికి వీలవుతుంది. అలా జరగకపోవడం వల్లే సారస్వత సంఘ సమావేశాల్లో (మొక్కుబడిగా సాగే) పిల్లలు ఈనాటి చర్చనీయాంశం ఏమనగా అంటూ నీళ్ళు నమలడమో భట్టీయం వేసింది గుర్తురాక బెంబేలుపడటమో జరుగుతుంది. అది పాఠ్య విషయమైనా, ప్రాపంచిక విషయమైనా పిల్లల్తో చర్చించాలి. చర్చించడం మాట్లాడ్డం పిల్లల ఆలోచనలకి ఎంతగా పదును పెడతాయో, భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని మరెం తగా అభివృద్ధి చేస్తాయో ఈ ఉదాహరణ గమనిద్దాం. ఒక పాఠశాలలో 3వ తరగతి పిల్లలు 'మనం త్రాగేనీరు' పాఠంలో వర్షపునీరు స్వచ్ఛమైనదా? కాదా? అనే అంశం మీద సుదీర్ఘంగా చర్చించారు. చర్చలో 'సముద్రపు నీరు ఆవిరై వర్షం కురుస్తుంది కదా! మరి సముద్రపు నీరు ఉప్పుగా ఉన్నప్పుడు వాననీరు స్వచ్ఛమైనది ఎలా అవుతుంది,' అనే అంశం వచ్చింది. ఈ సందర్భంలో టీచరు నీరు మరగటం, ఆవిరవడం గురించి ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో ఆలోచించండి. చర్చించడం వల్ల, ఒక అంశం గురించి మాట్లాడు కోవడం వల్ల ఆ విషయం పట్ల కలిగే అవధానం, ఎన్నిసార్లు వల్లె వేస్తే మాత్రం వస్తుంది. భాషైనా, గణితమైనా చివరికి పరిసరాల విజ్ఞానాలైనా పిల్లల్లో చర్చకు పెడితే వాళ్ళని మాట్లాడనిస్తే మన పాఠ్యపుస్తక రూపకర్తలకు కూడా అందని ఆలోచనల్ని పిల్లలు వ్యక్తపరుస్తారు. నిజానికి నేర్చుకోవడం ఎలాగో నేర్పడం టీచరు పని. అన్నీ మనమే నేర్పాలను కోవడం, ఆ దిశగా బలవంతపు శిక్షణ ఇవ్వడం మానవ సహజాతాలని మొద్దుబారుస్తున్నట్లే కదా!
'అమ్మ' 'అను 'అత్త' అను అంటూ చిలకపలుకులు నేర్పిస్తూ ఆనందించే అమ్మానాన్నలు నాలుగేళ్ళ పిల్లాడు మాట్లాడబోతే ఒఠ్ఠి వాగుడుకాయ, మాటలు రాకున్నా బావుండేదంటూ విసుక్కొంటారు. తరగతి గదిలో టీచరు కళ్ళు గప్పి నోరు విప్పడం తప్ప మరో అవకాశమే లేదు. అందుకేనేమో ఇంటర్వెల్‌కి లాంగ్ బెల్కి సంకెళ్ళుతెగిన బానిసల్లా మహెూత్సాహంగా పిల్లలు కేరింతలు కొడతారు. అదో ముగ్ధమనోహర దృశ్యం. ఇక్కడో మాట దిగంతర్ లాంటి పాఠశాలల్లో ఈ వైచిత్రి ఉండదు. ఎందుకంటే బడి ఓ బందిఖానాగా నోరు కుట్టేసుకొని శిలావిగ్రహాల్లా ఉండాల్సిన అవసరం అక్కడ ఉండదు. అనుభవాలు పంచుకోవడం, చర్చిస్తూ నేర్చుకోవడం, తగినంత స్వేచ్ఛ ఉండటమే కారణం. బెంచీకి నలుగుర్ని కుక్కి కూచోబెట్టి ఎడ్యుకేషనల్ షాప్స్లాంటి
పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 33