మనం చాలా వెనుకబడ్డ వాళ్ళనుకొన్న పిల్లలు కవికుమారులైపోతారు. మన ఊహక్కూడా అందని పదాలు వాళ్ళకి మహా ప్రీతిపాత్రమై కూచుంటాయి. ఎందుకోగాని పిల్లలకి 'దయ్యం' అనే పదం చాలా ఇష్టమంటుంది సెల్వియా. నిజానికి పైకి పదాలుగా అవి కన్పించినా పిల్లలకు మాత్రం వాళ్ళ అనుభవానికి శీర్షికలేనని సెల్వియా నమ్ముతుంది.
స్వాభావిక రచన
ఈ అనుభవాల్ని పదాల్నించి వాక్యాలకు మళ్ళిస్తే? అప్పుడది 'రచన' అవుతుంది. ఐదేళ్ళ బిడ్డలు కూడా రాయడం మొదలుపెడతారు. ఒక్కొక్కరు ఒక్కో 'శైలి'ని రూపొందించుకొంటారు. కీలకపదాలతోనే ఈ రచన ప్రారంభమవు తుంది. క్రమంగా అది విస్తరిస్తుంది.
మన దృష్టిలో అవి అర్థంపర్థంలేని తీరూతెన్నూలేని వాక్యాలు కావచ్చు. కానీ పిల్లల భావోద్వేగాలకవి అక్షర రూపాలు. అది వాళ్ళు మాట్లాడుకొన్నట్టే ఉంటుంది. లోలోపల అనుకొంటున్నట్టే ఉంటుంది. ఎదురెదురుగా కూచుని చెపుతున్నట్టే ఉంటుంది. కర్త, కర్మ, క్రియలు ఒక పద్ధతిలో ఉండవు వాటికి. అనాగరికం గా మనక్కన్పిస్తాయి. 'అయ్యో భాషకింత అన్యాయమా' అన్పిస్తుంది. 'ఇన్ని తప్పులైతే వీడు గట్టెక్కినట్టే' అని భయం వేస్తుంది. వీటన్నిటినీ మనం వదిలించుకొని చూస్తే ప్రాథమిక కవిత్వం ఆ వాక్యాల్లో కావల్సినంత కన్పిస్తుంది. వాటిని సవ్యాభావ్యంగా రసహృదయాలతో చూడగల్గితే కావల్సినంత రసానందమూ లభిస్తుంది. అక్కడ టీచరు పిల్లవాడి ముందు పిల్లవాడై పోతాడు. ఇక అప్పుడు జరిగేది రెండు హృదయాల మధ్య కలబోతలే.
దీన్ని సెల్వియా సజీవ బోధన అంటుంది.
పిల్లల స్వంత పుస్తకాలు
ఈ క్రమంలో పిల్లలు రచయితలవుతారు. స్వంతపుస్తకాలు రూపొందిస్తారు. అవన్నీ ఎక్కువ భాగం తమను గురించి తాము రాసుకొన్నవి. ప్రాథమిక దశలో పుస్తకాలు ఒక వాక్యంతోనే ఉండొచ్చు. తర్వాత కథల పుస్తకాలు తయారవుతాయి. వాటిలో వారి కన్నీళ్ళు, కరుణ, కొట్లాటలు, ప్రేమ, పాటలూ అన్నీ ఉంటాయి.
సెల్వియా మొయిరీల జీవితాన్ని ప్రేమిస్తుంది. యూరోపియన్లు తెచ్చిరుద్దిన సంస్కృతిని వ్యతిరేకిస్తుంది. మొయిరీల సంస్కృతి అంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ. అందువల్ల ఈ పుస్తకాల్లో వాళ్ళ సంస్కృతిని ఆమె దర్శిస్తుంది.
ఈ పుస్తకాలు రంగురంగుల ఖరీదైన పుస్తకాలతో పోలిస్తే ఎంతో అద్భుతంగా ఉంటాయి. పిల్లలు వీటికి స్వంతంగా బొమ్మలు వేస్తారు. వాళ్ళు ప్రపంచాన్ని వాళ్ళ స్వంత రంగుల్లో ప్రదర్శిస్తారు. అందువల్ల వాళ్ళ రంగులు వేరుగా ఉంటాయి. ఇలా ప్రతి తరగతికీ, గ్రూపుకీ పుస్తకాలు తయారవుతాయి. ఆరేళ్ళలో ఇవి వందలై పొయ్యాయి. అధికార్లు, విద్యాభిమానులు వీటిని చూసి విస్తుపొయ్యారు. కొన్నిటిని తస్కరించడానిక్కూడా
పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 29