ప్రాథమిక విద్య - ప్రత్యామ్నాయ విధానం
మనం ఇప్పుడు జ్ఞాన సమాజం వైపుకు పరుగెడుతున్నాం. ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వం, పౌరసమాజం 'అందరికీ విద్య'ను గురించి ఏకాభిప్రాయంతో ఉన్న కాలం మనది. అక్షరాస్యతా శాతం, స్థాయి అనేవి ఆయా సమాజాల అభివృద్ధికి, ఔన్నత్యానికి గీటురాళ్ళుగా పరిగణిస్తున్న యుగం మనది.
ఇంతవరకు బాగానే ఉంది. మనం దేన్ని అక్షరాస్యతగా లెక్కిస్తున్నాం? ఏ స్థాయి గీటురాయిగా అక్షరాస్యుల శాతాల్ని లెక్కిస్తున్నాం అనేది కూడా పెద్ద చర్చగానే ఉంది. ఒకవైపు చదువుకొన్నవారి శాతం పెరుగుతోంది. మరోవైపు చదువురాని వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అక్షరాస్యులుగా మనం లెక్కిస్తున్నా వారిలో ఎక్కువ మంది ఒక పేరా చదవలేరు. చదివినా దాని సారాంశం పట్టుకోలేరు. ఇలా ఎందుకు జరుగుతోంది?
ప్రాథమిక విద్యలో అసలు కారణం ఉంది
దీని మూలం ప్రాథమిక విద్యలో ఉంది. మన తొలితరపు విద్యార్థులు ప్రాథమిక స్కూళ్ళలోనే అక్షరాభ్యాసం చేస్తున్నారు. వీరిలో చాలా ఎక్కువమంది ఇక్కడితోనే చదువు ముగించేస్తున్నారు. ఈ ప్రాథమిక పాఠశాలల్లో ఏం చెపుతున్నారు? ఏం జరుగుతోంది? అనేది ‘అందరికీ విద్య'ను గురించి చర్చ జరిపేటపుడు అత్యంత కీలకాంశం అవుతుంది. మరి నిజంగా జరుగుతున్న దేమిటి? ప్రస్తుత విధానానికి మార్పులేమైనా అవసరమా? ప్రత్యామ్నాయం ఉందా? వీటిని చర్చిద్దాం.
ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన అంటే అక్షరాలు నేర్పించి, రాయడంలో నైపుణ్యాన్ని సంతరింపజెయ్యడంగా మనం భావిస్తున్నాం. అక్షరాల్ని పదాలుగా, పదాల్ని వాక్యాలుగా కలపడం ఈ ప్రక్రియలో కీలకమైంది. అక్షరాల రూపాన్ని, ఆకారాన్ని గుర్తించడం, పలకడం మన విద్యలో ప్రాథమిక దశ.
ఇందుకోసం మనం వాచకాల మీద ఆధారపడుతున్నాం. బహుశా ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఆధారపడనంతగా మనం ఇందుకోసం వాచకాల్ని ప్రామాణికంగా నమ్మి ఆధారపడుతున్నాం. మేము దేశంలోని చాలా వాచకాల్ని పరిశీలించాము. వాటి అభ్యసనాన్ని ప్రత్యక్షంగా చూచాము. పిల్లలతో, టీచర్లతో విస్తృతంగా మాట్లాడాము. తర్వాత కొన్ని నిర్ధారణలకొచ్చాము.
1. మన స్కూళ్ళలో అక్షరాల రూపాన్ని నేర్పించడానికే ప్రాధాన్యత వాటి అర్థాలకు (వినియోగానికి) ఇవ్వడం లేదు. నిత్య జీవితంతో దీనికి సంబంధం లేదు.
2. వాచకాల భాష, విషయంరెండూ పిల్లలకి సంబంధించనవి. అప్పటిదాకా వాళ్ళకు పరిచయమైన భాషకు భిన్నమైనవి.
దీనర్థం ఏమిటి? అక్షరాల్ని తప్పుల్లేకుండా రాయించడానికి మన శక్తినీ, విద్యార్థిశక్తినీ మొత్తం ఖర్చు చేస్తున్నాం. అపరిచితమైన, కృత్రిమభాషను భాషగా చదివే సామగ్రి (పాటలు, కథలు, వాక్యాలు వగైరా) కావాలి. బిడ్డకి ఇది అందుబాటులో ఉండాలి.
మూడవది భాష నేర్చుకోడంలో బిడ్డకు వినోదం కూడా కావాలి. అది భావప్రసారం నుంచి మాత్రమే
పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 17