Jump to content

పుట:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లల ఎదుగుదల్లో భాష స్థానమేంటి? తొలితొలి భాష పిల్లలకెలా అబ్బుతుంది? అదెలా క్రమవికాసం చెందుతుంది? ఈ క్రమాన్ని కొంపదీసి మన బడి కాల రాస్తోందా? అందుకే మన పిల్లలు ఎన్నేళ్ళు చదివినా నాలుగు ముక్కలు చదవలేక పోతున్నారా? ఈ దుస్థితికి మనకు భాష పట్ల, భాష నేర్పడం పట్ల ఉన్న దృక్పథమే కారణమా? భాషాభేషజమే మూలమా?

ఈ ప్రశ్నలన్నింటికీ ఈ గ్రంథంలో సమాధానాలు లభిస్తాయి. భాష మీదా, భాషాబోధన మీదా జీవితాలు వెచ్చించి, పరిశోధించి, ప్రయోగాలు చేసిన ఉద్దండుల అనుభవాలివి. అరటిపండు ఒలిచి పెట్టినట్టు మాతృభాషనే గాదు పరాయిభాషలనూ నేర్పడం ఎలాగూ మనకు కరతలామలకం చేస్తాయివి.

116