అని మన శ్రుత పాండిత్యం సవాలు చెయ్యొచ్చు. కానీ 'బయటి ప్రపంచ భావన' పసిబిడ్డలో ఏర్పడే పునాదికి సైతం భాషే మూలమని, నరవానరుల నుంచి నరుడిగా పరిణామం చెందిన మనిషి, తర్వాత తర్వాత చెందిన సామాజిక పరిణామాల్లోనే గాదు శారీరక పరిణామంలో సైతం భాష ఎంతో ప్రముఖ పాత్ర వహించిందనేది శాస్త్రజ్ఞుల అంచనా.
బిడ్డ ఎదుగుదలని పుట్టిన నాటినుంచీ అడుగడుగునా పరిశీలించిన మానసిక శాస్త్రవేత్తలెందరో ఉన్నారు. బిడ్డకి ఆకలవుతుంది. ఆకలంటే ఏదో తనకి తెలీదుగానీ శరీరంలో ఏదో అసౌకర్యం ఏర్పడింది. ఏడుస్తుంది. అమ్మవచ్చి ఎత్తుకొంటుంది. పాలిస్తుంది. పాలిస్తూ పాలిస్తూ బిడ్డని ఆప్యాయంగా స్పృశిస్తుంది. ముద్దాడుతుంది. 'ఆకలైందామ్మా నా బుజ్జిగదే,' అంటూ ఏదేదో మురి పాలు కురిపిస్తుంది. మరి ఈ తల్లి మాటలకేం అర్థం వుంది? ఆ బిడ్డకివి అర్థమయ్యేనా? ఇవీ స్వగతాలే గదూ. ఆ స్వగతమే బిడ్డ వినే మొదటి మాట గావచ్చు. ఆ స్పర్శా, ఆ పాటా, ఆ మాటా ఇవే బిడ్డను స్వీయ ప్రపంచం నుంచి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టించేవి, అనుసంధానం చేసి పెట్టేవి! తర్వాత తర్వాత బిడ్డతో ముఖ్యంగా తల్లీ, తర్వాత ఇంటిల్లిపాదీ చేసే ఈ ముచ్చట్లే ఆమెను ఊహకందనంత వేగంగా వేయిరేకుల పద్మంలా వికసింపజేసేవి. నాలుగేళ్ళ లోపు బిడ్డలోని 'బహుముఖ అభి వృద్ధి' ఎంత వేగంగా వుంటుందో అంత బహు ముఖంగానూ ఉంటుంది. అంతకంటే విచిత్రం ఈ అభివృద్ధి పిల్లలందరిలోనూ దాదాపు సమానంగా వుంటుంది. మాటకున్న విలువ అంత మహత్తరమైందన్న మాట!
పండితురాలు అమ్మ!
ఇలా పసిబిడ్డలతో చేసే సంభాషణల్లో మనం 'అర్థాలు' వెతకం. తప్పుల్ని పట్టం. చెప్పిందే చెపుతున్నా వింటాం. అన్నిటికంటే మించి ప్రతి మాటనూ ముత్యంగా లెక్కించి సంబరపడతాం. ప్రోత్స హిస్తాం. బిడ్డతో మాట్లాడేప్పుడు ఆ బిడ్డలా మారిపోతాం. వాళ్ళ సందర్భాల్లోకి మనం వెళ్ళిపోతాం. అస్సలు ఎప్పుడూ వాళ్ళ భాషని సంస్కరించాలనీ, క్రమబద్ధీ కరించాలని పూనుకోం. గుర్రాన్ని గుల్లం అంటే విరగ బడి నవ్వుతాం. మళ్ళీ మళ్ళీ అనమని ఒక్కోసారి ఒక్కో ముద్దిస్తాం. ఎంత అద్భుతం! మనం పిల్లలకి భాష 'నేర్పు తున్నా'మన్న ఆలోచనే మనకు లేదు. మనమెక్కడా ఈ బోధనాభ్యసన సూత్రాలు నేర్చుకోలేదు. కోటానుకోట్ల తల్లిదండ్రులు సహస్రాబ్దాల నుంచి తమ పిల్లల్ని ఇలా పెంచుతున్నారు. వారికిలా నేర్పుతున్నారు. పిల్లలూ ఇలా అద్భుతంగా నేర్చుకొంటున్నారు. ఒక్క డ్రాపౌట్ లేదు. ఒక్కరు వెనకబడ్డవారు లేరు. ఈ అసమాన 'బోధనా కళ' అక్షరం ముక్కరాని 'అనాగరిక' బడుగుజీవులకి సైతం ఎలా అబ్బినట్టు?
ఈ నేర్పడానికో సిలబసు లేదు. ప్రణాళిక లేదు. కనీసాభ్యసన ప్రమాణాల ఊసు లేదు. పరీక్షలసలే లేవు. వున్నదల్లా ఒక్కటే, ‘ఒకానొక పద్ధతి.' ఈ పద్ధతిలో అందరికంటే పండితురాలు ‘అమ్మ.'
మాటలేనా అమ్మ నేర్పింది?
బిడ్డ ఈ అభివృద్ధి క్రమంలో అమ్మ నేర్పుతున్నది ఒక్క మాట లేనా, కానేకాదు. ఈ మాటలతో పాటు పూసల్లో దారంలా బయటి ప్రపంచం లోని ప్రతిదీ బిడ్డ తెలుసు కొంటోంది. ప్రతి చర్యలోనూ బిడ్డ పాల్గొంటోంది. ఒక సమర్థ ప్రాణిగా నిలదొక్కు కుంటోంది. నిరంతర చలనంతో, పలు సందర్భాల్లో స్వేచ్ఛగా స్వతం త్రంగా తనదైన శైలితో పాల్గొన డంతో బిడ్డ ఎదుగుతోంది. ఈ క్రమంలో 'భాష' అత్యంత కీలక పాత్ర వహిస్తోంది. అన్నిటినీ మించి భావనల్ని (కాన్సెప్ట్), ఆలోచనల్ని (థాట్స్) ననలు తొడిగించి, మెదడుకితగ్గ వ్యాయామం అందించి వికసింప జేస్తున్నది ఈ భాషే!
పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? ◆ 10